ఇంట్లో దోమలు పోవాలంటే ఈ మొక్కలు ఉండాల్సిందే..?

Divya
వేసవి మొదలవగానే ఇంటా బయట దోమల బెడద మొదలవుతుంది.ఇవి రాత్రి నిద్ర లేకుండా చేయడమే కాకుండా ప్రాణాంతకమైన వ్యాధులను కలుగజేస్తూ, ప్రజలందరిని తెగ ఇబ్బంది పెడుతుంటాయి.అటువంటి దోమలను ఇళ్ల నుంచి పారద్రోలెందుకు,ఆల్ ఔట్ లు, రిప్లెంట్స్ వంటివి ఎన్ని పెట్టినా,అవి పోకపోగా వాటి రిప్లెంట్స్ వల్ల శ్వాస కోశ వ్యాధులు అధికమవుతున్నాయి.కావున దోమలను పారదోలెందుకు సహాజంగా కొన్ని రకాల చెట్లను పెంచుకోవడం చాలా ఉత్తమం.అటువంటి చెట్లను పెంచుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే ఘాటైన సువాసనల వల్ల,దోమలు పారిపోతాయి.అంతటి ఉపయోగకరమైన మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం

లావెండర్ మొక్క..
లావెండర్ మొక్క సాధారణంగా మంచి పరిమళభరితమైన సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది.ఇవి మనకు ఇష్టంగా ఉన్నా,దోమలకు ప్రాణాంతకంగా ఉంటుంది.కావున ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల దోమలు ఇంటిలోకి రాకుండా ఉంటాయి.ఈ మొక్కను పెంచుకోవడానికి వీలు లేకపోతే, లావెండర్ నూనెను ఇంటి నిండా స్ప్రే చేయడం వల్ల కూడా దోమలను పారద్రోలవచ్చు.

బంతిమొక్క..
 బంతిపూలను సాధారణంగా దేవుళ్లను పూజించడానికి వాడుతూ ఉంటాము.బంతి పూల చెట్లను నాటడం వల్ల ఇందులోని ఫైరేత్రం అనే  పరిమళం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా పారిపోతాయి.కావున ప్రతి ఇంట్లో బంతిపూల మొక్కలు నాటు కోవడం చాలా ఉత్తమం.మరియు సులభంగా పెరిగే మొక్క కూడా.

పుదీనా..
పుదీనాను ఇంట్లో పెంచుకోవడం వల్ల,దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడు కోవచ్చు.పుదీనా పెంచుకోవడానికి వీలు లేకపోతే పిప్పర్మెంట్ ఆయిల్ ని ఒక బాటిల్ లో తీసుకొని,ఇల్లంతా స్ప్రే చేయడంతో,ఆ ఘాటైనా వాసనకు దోమలు దరి చేరవు.

తులసి మొక్క..
తులసిలో సాధారణంగా క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.దీనిని వాకిలి పక్కనే పెట్టుకోవడం వల్ల ఇంట్లో కి దోమలు రాకుండా ఉంటాయి. ఒక వేళ ఇంట్లో వున్నా పారిపోతాయి.

రోజ్మేరీ మొక్క..
రోజ్మేరీ మొక్క నుంచి వచ్చే పరిమళం ఎంతో సువాసనభరితంగా ఉంటుంది.కానీ దీనిని దోమలు అస్సలు భరించలేవు కావున.ఇంట్లోని దోమలను పారద్రోలెందుకు రోజ్మెరి మొక్కను పెంచుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: