గరికతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

Purushottham Vinay
గరిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దీని గురించి అందరికీ కూడా తెలిసిందే. ఇది పొలాల గట్ల మీద, చేలల్లో, మన ఇంటి దగ్గర ఇలా ఎక్కడపడితే అక్కడ గరిక అనేది బాగా పెరుగుతుంది.అయితే ఈ గరికను ఉపయోగించి మనం ఖచ్చితంగా చాలా రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఇక మీకు గాయాల నుండి రక్తం కారుతూ ఉంటే పచ్చి గరిక గడ్డిని ఇంకా అలాగే ఉత్తరేణి ఆకులను, చిన్న యాలకులను సమానంగా కలిపి వాటిని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని గాయాలపై రాసిన వెంటనే ఆ గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది.అయితే చర్మ రోగాలను తగ్గించే గుణం కూడా గరికకు ఉంది. గరకి గడ్డిని ఇంకా పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై లేపనంగా రాసుకోవడం వల్ల దురదలు, దద్దుర్లు ఇంకా అలాగే గజ్జి వంటి చర్మ రోగాలు చాలా సులభంగా తగ్గుతాయి.


ఇంకా అదే విధంగా గరిక తైలాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల అన్ని రకాల చెవి సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. తెల్ల గరిక సమూల రసం 80 గ్రా., నువ్వుల నూనె 60 గ్రా., ముల్లంగి రసం 60 గ్రా., సైంధవ లవణం 10 గ్రాములు తీసుకొని కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నూనె మిగిలే దాకా మరిగించి నిల్వ చేసుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న నూనెను నాలుగు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవిలో హోరు తగ్గుతుంది. ఇంకా చీము చీము నుండి రక్తం కారడం, చెవుడు వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే గుణం కూడా ఈ గరికకు ఉంది. మంచి ప్రదేశంలో పెరిగిన గరికను తీసుకుని దానిని బాగా శుభ్రంగా కడగాలి. తరువాత దానిని దంచి దాని రసాన్ని  తీయాలి. ఈ రసాన్ని రెండు పూటలా మూడు టీ స్పూన్ల మోతాదులో తాగుతూ ఉంటే ఖచ్చితంగా ఒక 20 రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్లు చాలా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: