సాధారణంగా స్త్రీలకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, తిమ్మిరి, వాంతులు, వికారం ఇంకా అలాగే తలనొప్పి వంటి ఎన్నో రకాల సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి.పీరియడ్స్ అనేవి ఒక్కొక్కరినీ ఒక్కోలా ప్రభావితం చేస్తాయి. అయితే స్త్రీలు మంచి పరిశుభ్రత కనుక పాటిస్తే.. మహిళలు శుభ్రంగా ఉండటమే కాకుండా పీరియడ్స్ నొప్పి కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో మహిళలు ఖచ్చితంగా కూడా పరిశుభ్రతను పాటించాలి.ఇక పీరియడ్స్ సమయంలో కాటన్ శానిటరీ న్యాప్కిన్స్ లేదా టాంపోన్లను వాడటం చాలా మంచిది. ఎందుకంటే అవి చర్మంపై చాలా సాఫ్ట్ గా ఉంటాయి. వీటి వాడకం వల్ల చికాకు లేదా దద్దుర్లు అనేవి రావు. వారి బట్టలపై మరకలు పడకుండా ఉండటానికి ఒకేసారి రెండు శానిటరీ ప్యాడ్లను కూడా ఉపయోగిస్తుంటారు.
చాలా మంది కూడా బ్లీడింగ్ ఎక్కువయ్యే మొదటి రెండు మూడు రోజులు ఇలా రెండు రెండు శానీటరీ ప్యాడ్లను ఉపయోగిస్తుంటారు . దీనివల్ల బట్టలపై మరకలు పడవేమో కానీ చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇలా చెయ్యడం వల్ల యోని ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అందుకే స్త్రీలు ఒకేసారి ఒక ప్యాడ్ ను మాత్రమే ఉపయోగించండి.ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా గోరువెచ్చని నీటితో కడగాలి.అలాగే ఖచ్చితంగా ప్రతి నాలుగు గంటల తర్వాత మీ టాంపోన్లు లేదా ప్యాడ్లను మార్చాలి. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఎక్స్ ట్రా ప్యాడ్ లేదా టాంపోన్ ను మీరు తీసుకెళ్లండి. అలాగే సౌకర్యవంతమైన కాటన్ లో దుస్తులనే మాత్రమే ధరించండి. ఎందుకంటే ఇవి మీరు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి. ఇంకా మీ జననేంద్రియ ప్రాంతంలో లేదా చుట్టుపక్కల దద్దుర్లు ఇతర సమస్యలు రాకూడదంటే వదులుగా ఉండే కాటన్ దుస్తులని మాత్రమే వేసుకోండి.పీరియడ్స్ లో నొప్పులు రాకుండా ఇలా చెయ్యండి..