ఇంట్లో పావురాలను పెంచుకుంటున్నారా..?తస్మాత్ జాగ్రత్త..!

Divya
పూర్వం నుంచే మనం ఇళ్లల్లో పెంపుడు జంతువులను ఒక భాగంగా పెంచుకుంటున్నాం. వాటిని ఇంట్లో వ్యక్తుల్లాగా చూసుకుంటుంటాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కుక్కలను,పిల్లులను మరియు కొన్నిరకాల పక్షులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం సర్వసాధారణమైపోయినది. కానీ కొన్నిరకాల పక్షులను పెంచుకోవడం,ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పావురాలు పెంచుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు చుట్టుముడుతున్నాయి. కొందరు వ్యక్తులు అయితే అనారోగ్యాల సమస్యల వల్ల,మరణం వరకు వెళ్లారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందువలన అంటే పావురాలు విసర్జించే మలం వల్ల 60 రకాల రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. అందువలన శాస్త్రవేత్తలు పలువురిలో అవగాహన కొరకు,పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, పావురాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తున్నారు. ఈ పక్షులు తమ రెట్టల్లోఅనేకజీవులను మరియు వాటి అవశేషాలను మోసుకొని వెళ్లి పలు వ్యాధులకు వ్యాపింప చేస్తున్నాయి. ఈ పావురాలు పూప్ శుభ్రం చేసే సమయంలో,అక్కడ వచ్చే దుమ్మును పీల్చుకోవడం వల్ల అనేకరోగాల బారిన పడుతున్నారు.

పూప్ అనగా..
పావురం విసర్జించే రెట్టలను పరిశీలిస్తే, చిన్న చిన్న గోళీలల్లా కనిపిస్తాయి. మరియు తెలుపు-గోధుమ రంగులో ఉంటాయి.పావురం లాంటి పక్షులు యూరికోటెలిక్ కావడం వల్ల యూరియా, అమ్మోనియాకు బదులుగా యూరిక్ యాసిడ్ రూపంలో మలంను నైట్రోజన్ రూపంలో విసర్జిస్తాయి. ఇందులో అమ్మోనియా అధికంగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి.దీనివలన హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్ మరియు కాన్డిడియాసిస్ వంటి శిలీంధ్ర వ్యాధులకు,పిట్టకోసిస్, ఏవియన్ టీబీ వంటి బాక్టీరియా వ్యాధులకు, బర్డ్ ఫ్లూకి వ్యాపిస్తాయి.డ్రై అయిన రెట్టల నుండి వచ్చే దుమ్మును పీలిస్తే అవి కాలేయం, ప్లీహాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో అధిక జ్వరం, న్యుమోనియా, రక్త అసాధారణతలు, ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యసమస్యలు కలుగుతాయి.
నివారణ చర్యలు..
పావురం రెట్టలను శుభ్రపరిచేటప్పుడు, 0.3 మైక్రాన్ల కంటే   కణాలను పిల్టర్ చేసే మాస్క్ లను, షూకవర్లను, గ్లౌస్ లను వాడాలి. మరియు శుభ్రం చేసిన మలంను రెండు రోజులపాటు మూసి ఉంచాలి.మలం శుభ్రం చేసేటప్పుడు ధూళి లేయకుండా, నీళ్లు చల్లి,మలంను శుభ్రం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: