ఈ ఆకుతో అన్ని నొప్పులు, రోగాలు మాయం?

Purushottham Vinay
జిల్లేడు మొక్క ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది.ఇక ఈ మొక్కని ఉపయోగించడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జిల్లేడు ఆకులు తమలపాకుల లాగా ఉంటాయి. ఇంకా అలాగే జిల్లేడు చెట్టు ప్రతి భాగం నుండి కూడా పాలు వస్తాయి. అయితే ఈ జిల్లేడు పాలు విషపూరితమైనవి. అదే విధంగా జిల్లేడు చెట్టు ప్రతి భాగంలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.ఇంకా అలాగే వీటిలో ఎర్ర జిల్లేడు ఇంకా తెల్ల జిల్లేడు అని రెండు రకాలు ఉంటాయి. ఈ మొక్క చాలా విషపూరితమైనదే అయినప్పటికి దీనిని సరైన పద్దతిలో వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు పాలకు సమానంగా నీటిని కలిపి కాళ్లకు రాసుకోవడం వల్ల ఖచ్చితంగా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ఇంకా అలాగే జిల్లేడు ఆకులను వేడి చేసి మోకాళ్ల నొప్పులు అలాగే కీళ్ల నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి.



ఇక ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపు ఇంకా అలాగే ఎరుపుదనం అన్నీ కూడా చాలా ఈజీగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఇంకా అలాగే ఈ మొక్క ఆకులను వేడి చేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కలు తీసుకొని చెవిలో వేయడం వల్ల చెవినొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అదే విధంగా స్త్రీలల్లో వచ్చే ఋతు దోషాలను తగ్గించడంలో కూడా జిల్లేడు పువ్వుల పొడి చాలా ఉపయోగపడుతుంది. జిల్లేడు ఆకులకు పసుపు కలిపి నూరి లేపనంగా రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఒక గిన్నెలో లవంగాలను తీసుకుని అవి మునిగే దాకా జిల్లేడు పాలను పోసి ఎండలో పెట్టాలి. ఇలా ఒక వారం రోజుల పాటు పాలు పోస్తూ ఎండబెడుతూ ఉండాలి. ఆ తరువాత ఈ లవంగాలను పూర్తిగా ఎండబెట్టి వాటిని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లవంగాలను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా చాలా ఈజీగా తగ్గి సుఖ విరోచనం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: