దగ్గు, కఫం చిటికెలో ఖతం అవ్వాలంటే..?

Purushottham Vinay
దగ్గు, కఫం వంటి సమస్యలు ఈజీగా తగ్గాలంటే ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లను పోసి వాటిని వేడి చేయాలి. ఇక  మూడు వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. తరువాత ఈ నీటిలో  పది మిరియాలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తరువాత పది లవంగాలను ఇంకా అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. తరువాత ఇందులో 6 లేదా 7 తులసి ఆకులను అర గుప్పెడు పుదీనా ఆకులను ఇంకా పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని మీడియం మంటపై ఒక గ్లాస్ కషాయం అయ్యే దాకా మరిగించాలి. ఆ తరువాత దీనిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయిన తరువాత కాఫీలా చేసుకోని కొద్ది కొద్దిగా తాగాలి.ఇక ఇలా రెండు నుండి మూడు రోజుల పాటు ఈ కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల దగ్గు, కఫం వంటి సమస్యల నుండి చాలా త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు.


ఈ కషాయం తయారీలో వాడిన పదార్థాలన్నీ కూడా మన వంటింట్లో ఉండే పదార్ధాలే. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ వైరల్ లక్షణాలతో పాటు అనేక ఔషధ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి దగ్గు, కఫంతో పాటు జలుబు, గొంతు నొప్పి ఇంకా అలాగే గొంతులో గరగర వంటి వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా మనం ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే ఈ కషాయాన్ని పిల్లలకు కూడా తాగించవచ్చు. దగ్గు, కఫం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు మందులను వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే ఈ కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: