వాషింగ్ మెషిన్: మొండి మరకలు పొవట్లేదా? ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ప్రస్తుతం అయితే చాలా మంది ఇళ్లలో కూడా వాషింగ్ మెషీన్ ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు తక్కువ డిటర్జెంట్ ఇంకా అలాగే తక్కువ నీటిలో బట్టలు మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు.అయితే చాలా సార్లు వాషింగ్ మెషీన్ సరిగ్గా ఉపయోగించకపోతే, బట్టలు మురికిగా ఉంటాయి. లేదంటే..బట్టలపై అక్కడక్కడ డిటర్జెంట్ అంటుకుని కనిపిస్తుంది. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే వాటికి కొన్ని సూపర్ టిప్స్ వున్నాయి. ఖచ్చితంగా వాటిని పాటించండి.వీటిని పాటించడం ద్వారా మీరు మీ బట్టలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఎక్కువ మురికి బట్టలు విడిగా, తక్కువ మురికి బట్టలు విడిగా ఉతకాలని గుర్తుంచుకోండి. తక్కువ మాసిన బట్టలు ఉతకడానికి తక్కువ సమయం, తక్కువ నీరు పడుతుంది. కాబట్టి మెషీన్‌ తక్కువ సమయాన్ని కేటాయించండి. అదే సమయంలో ఎక్కువ మురికి బట్టలు ఎక్కువ టైమ్‌ పాటు ఎక్కువ మెషీన్‌ తిప్పడం అవసరం.



ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు బట్టల ప్రకారం వేర్వేరు ప్రోగ్రామ్‌లను కలిగి ఉంటాయి. కానీ, తప్పు ప్రోగ్రామ్‌ను ఎంచుకోవడం వలన కొన్నిసార్లు బట్టలు శుభ్రంకావు. అందువల్ల, బట్టల తీరుకు అనుగుణంగా మెషీన్‌ ప్రొగ్రామ్‌ని మార్చండి. దీని కారణంగా డిటర్జెంట్ కూడా తక్కువగా అవసరం అవుతుంది. నీరు కూడా తక్కువగా తీసుకుంటుంది.తరచుగా లాండ్రీ బ్యాగ్‌లో ఉంచిన బట్టలు ఉతకడానికి మెషిన్‌లో అన్ని కలిపి వేస్తారు. కానీ అలా చేయకూడదు.వివిధ బట్టలు కలిపి ఉతకడం వల్ల చాలా సార్లు బట్టలు మురికిగా ఉంటాయి. గట్టి బట్టలతో మృదువైన బట్టలు ఉతకడం వల్ల అవి పాడైపోయే ప్రమాదం ఉంది. పైగా చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మందమైన బట్టలు ఎక్కువసేపు ఉతకవలసి ఉంటుంది.ముందు మృదువైన బట్టలు త్వరగా ఉతికిన తరువాత గట్టి బట్టలు వేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ టైం బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: