మూత్రం ఆపుకుంటున్నారా? అయితే ప్రమాదమే?

Purushottham Vinay
మన బాడీలో అన్ని రకాల టాక్సిన్స్, మలినాలు బయటకు వెళ్లినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడే మన శరీరం కూడా సరిగా పని చేస్తుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది విసర్జన వ్యవస్థ.మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళతాయి. తద్వారా రక్తం శుభ్రమవుతుంది. అలా కాకుండా మూత్రాన్ని ఎక్కువసేపు అదిమిపెట్టుకుని ఉండటం వల్ల అనేక వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. ఏ కారణం చేతనైనా మూత్రం ఆపుకోవడం హనీకరం అని స్పష్టం చేస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో మంట వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కావాలని కాకుండా, సహజంగా మూత్ర విసర్జన ఆలస్యంగా వస్తున్నట్లయితే.. అనారోగ్యానికి సంబంధించి ఇండికేషన్ అని చెబుతున్నారు నిపుణులు. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.3 కిలోల కంటే ఎక్కువ బరువున్న క్షీరదాలు 21 సెకన్లలో మూత్రాశయాలను ఖాళీ చేస్తాయి. ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడానికి 20 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, వారు ఎక్కువసేపు మూత్రాన్ని అదిమిపట్టుకున్నారని అర్థం. మూత్ర విసర్జన సమయానికి చేయకపోయినా, ఎక్కువ కాలం అధిమి పట్టుకున్నా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.


మూత్ర విసర్జన సమస్య దీర్ఘకాలంగా ఉంటే కిడ్నీల్లో రాళ్లు, పిత్తాశయంలో వాపు, ప్రోస్టేట్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా మూత్రం ఆలస్యంగా వస్తున్నట్లయితే, మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.కొంత మంది మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పడుతుంది. మరికొంతమంది వెంట వెంటనే మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇంకొందరైతే వస్తున్న మూత్రాన్ని అదిమిపెట్టుకుని గంటల తరబడి అలాగే ఉంటారు. అయితే, ఇలా చేయడం చాలా డేంజర్ అని చెబుతున్నారు వైద్యులు. దీనికి సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడించారు పరిశోధకులు. ఈ ప్రపంచంలోని అనేక మంది ఆరోగ్య నిపుణులు ఇంకా అలాగే డాక్టర్లు మూత్రాన్ని ఆపుకోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి మూత్రాన్ని ఆపుకోకండి. ఎప్పటికప్పుడు మీ శరీరంలోని మళ్లినాలను మూత్రం ద్వారా బయటకి పంపించండి. అప్పుడు ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా ఆరోగ్యంగా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: