సాధారణంగా ముసలి వాళ్లకు వారి జ్ఞాపకశక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో నేటి పిల్లల్లో కూడా ఈ సమస్య సర్వసాధారణమైపోయింది.పిల్లలోనే కాదు యువతలో కూడా ఈ సమస్య అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అయితే దీనికి కారణం ఇంకా అలాగే తగ్గే చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణంగా చెప్పవవచ్చు. కొన్నిసార్లు తలకు గాయం కావడం వల్ల చాలా విషయాలను గుర్తుంచుకోవడంలో కూడా సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని భయంకరమైన వ్యాధి కారణంగా ఇలా జరుతుండవచ్చు..అయితే ఇలాంటి సమస్యను మనం అదేపనిగా మనసులో పెట్టుకోవపోవడం సరికాదు. అయితే జ్ఞాపకశక్తి తగ్గుతున్నదని తెలిసిన తర్వాత వెంటనే దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. తగ్గిపోతున్న జ్ఞాపకశక్తికి పెంచుకునేందుకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు మెమరీ లాస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.బ్రాహ్మీ పాలు మెదడుకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు మీ జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో సహాయపడతాయి.
పెద్ద విషయం ఏమిటంటే ఇది ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగించదు.. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అర్థం. మీరు 1 గ్లాసు పాలలో అర టీస్పూన్ బ్రహ్మీని మరిగించి సుమారు 2 నిమిషాలపాటు వేడి చేయండి. ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఈ పాలను త్రాగాలి.అంతేకాదు క్యారెట్ జ్యూస్‌లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి జ్ఞాపకశక్తి కోసం.. ఉదయం పూట బహిరంగ ప్రదేశంలో వ్యాయామం చేయడం.. నడవడం, శిర్షాసన, ధనురాసనం వంటి యోగాసనాలను వేడయం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. మతిమరుపు నుంచి దూరంగా ఉంచే కొన్ని ఆసనాలు కూడా వేయడం మంచిది. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్లుగా చూసుకుంటే కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. దీనితో పాటు వాల్‌నట్‌లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌ను పాలల్లో కలిపి తాగడం వల్ల మతిమరుపు పోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మతిమరుపు తప్పించుకొని మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి.