లైఫ్ స్టైల్: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే అని హెచ్చరిస్తున్న నిపుణులు..!!

Divya
ఈ మధ్యకాలంలో పెద్దలతో పాటు యువత కూడా గుండెపోటు సమస్యతో మరణిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల కాలంలో మరీ ఎక్కువగా సెలబ్రిటీలు అలాగే 30 సంవత్సరాలు లోపు వయసు ఉన్న యువత ఇలా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఇక దీనికి ప్రధాన కారణం అనారోగ్య జీవన శైలి, ఒత్తిడి అని వైద్యులు హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గుండెపోటును సైలెంట్ కిల్లర్ అని వైద్య భాషలో పరిగణిస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. అంతేకాదు సంకేతాలు కానీ ఏదైనా ప్రారంభ లక్షణాలు కానీ ఏమాత్రం ఉండవు. సకాలంలో గుర్తించకపోవడం,  నిర్లక్ష్యం లాంటి కారణాల వల్ల మరణాలకు దారితీస్తుంది. ముఖ్యంగా చాలా కేసులు సాధారణ లక్షణాలను గురించి బయట పెట్టరు. అందుకే ఇలా గుండెపోటు కేసులు యువతలోని ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఇకపోతే 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువకులలో గుండెపోటు రావడానికి అత్యంత ముఖ్యమైన ప్రధాన కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే అసాధారణమైన లిపిడ్ ప్రొఫైల్, ధూమపానం, మద్యపానం,  ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ కూడా హృదయ స్పందన వ్యాధులకు కారణమవుతాయట.. అంతేకాదు జన్యువుల ప్రభావం కూడా దీనికి సహకరిస్తుంది అని వైద్యులు తెలియజేస్తున్నారు. అంతేకాదు అతిగా వ్యాయామం చేసే వారు కూడా గుండెపోటుకు గురి అవుతున్నారు.నిజానికి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ విపరీతంగా చేయడం వల్ల గుండెపోటు వస్తుందట.

ప్రముఖ కార్డియాలజిస్టు ల్యూక్ లాఫిన్ మాట్లాడుతూ గతంలో 50 సంవత్సరాల పైబడిన వారిలో మాత్రమే గుండెపోటు చూసేవాళ్ళము. కానీ ఇటీవల 25 లేదా 35 సంవత్సరాల వయసు కలిగిన యువకులలో ఇలా గుండెపోటును చూస్తూ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ వారు వెల్లడించారు. అంతే కాదు దీనిని వైద్య చరిత్రలోనే అరుదుగా చర్చించే వారిని కూడా డాక్టర్ వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా యువత ఆరోగ్య పట్ల జాగ్రత్త వహిస్తేనే గుండెపోటు నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: