
తెలంగాణలో వింత గ్రామం.. సాయికుమార్ చెప్పిన విషయంతో అందరూ షాక్?
కానీ తెలంగాణ లో ఒక వింత గ్రామం ఉందని.. ఆ గ్రామం లో సాయంకాలం వాతావరనాన్ని ఇప్పటివరకు గ్రామస్తులు అనుభూతి చెందలేదని ఎవరికి తెలియదు. దీనికంతటికీ కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులేనట. అయితే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయికుమార్ కారణంగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు ఈటీవీలో వావ్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు సాయి కుమార్.
ఈ కార్యక్రమం లో భాగంగా అప్పుడప్పుడు ఎంతో ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇటీవలే వావ్ షోలో భౌగోళిక పరిస్థితి కారణంగా సాయం కాలం వాతావరణాన్ని అనుభూతి చెందని గ్రామం ఏది అంటూ ప్రశ్నించాడు.. దీనికి ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు అని చెప్పాలి. దీంతో ఆ గ్రామం ఏదో కాదు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని కోదురుపాక గ్రామం అంటూ చెప్పుకొచ్చాడు. అక్కడ 4 గంటలు అవుతుంటే నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతుందట. అయితే కుదురుపాక గ్రామానికి చుట్టూ నాలుగు వైపులా గుట్టలు ఉండడంతో ఇక్కడి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల పై ప్రభావం చూపిస్తున్నాయట.