కరక్కాయ లో జలుబు ఇంకా దగ్గులను నివారించే కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కరక్కాయ వలన ఇటువంటి లాభాలే కాకుండా ఇంకా చాలా రకాల లాభాలు ఉన్నాయి అని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ కరక్కాయతో ఖచ్చితంగా నాలుగు ఫలితాలను పొందవచ్చు. అవి ఏంటంటే మొదటిగా మన శరీరంలో గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి కరక్కాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఉండే టానిన్స్, ఎంథోకీనోన్స్ ఇంకా పాలీఫినోస్ ఎక్కువగా ఉంటాయి.ఇది మీ పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు మనం తిన్న ఆహారం పొట్ట పేగులలో ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చాలా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కావున కరక్కాయ ను తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి.ఇంకా కరక్కాయను పొడి లాగా చేసుకుని మజ్జిగలో కలుపుకొని తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. రెండవది కరక్కాయలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు నాలుగు రకాల కెమికల్ కాంపౌండ్స్ వలన మన శరీరంలోని ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి. ఈ కరక్కాయ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఇంకా యాంటీ ఫంగస్ గా పనిచేస్తాయి. ఇవి ప్రేగులలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని ఈజీగా చంపేస్తాయి. ఇంకా అలాగే శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్న తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మూడవదిగా ఈ కరక్కాయ అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గటానికి కూడా బాగా సహాయపడుతుంది.
అలాగే కరక్కాయ బాడీలోని మెటాబాలిజం ను యాక్టివేట్ చేసి బాడీలోని అనవసరపు కొవ్వులు కూడా కలిగిస్తుంది. దీనికి సెల్ బర్నింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.కాబట్టి అధిక బరువు ఉన్నవారు కరక్కాయను పొడి లాగా చేసుకుని తింటే బరువు తగ్గుతారు. ఈ కరక్కాయ జుట్టు పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది. కరక్కాయను పొడి లాగా చేసుకుని దానిలో కొద్దిగా కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఇలా కలిపితే మెత్తని క్రీం లాగా అది తయారవుతుంది. అలాగే జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ కరక్కాయతో చేసిన క్రీమ్ ను తలమాడుకు కనుక రాస్తే జుట్టు కుదుళ్ల నుంచి చాలా దృఢంగా ఉంటుంది. ఇంకా అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ కరక్కాయను పొడి లాగా చేసుకుని వేడినీళ్లలో వేసి బాగా కలుపుకొని వాడుకోవచ్చు. ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే వారు కరక్కాయతో చేసిన మిశ్రమాన్ని రెండు పూటలా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అధిక బరువు ఉన్నవారు కూడా సులువుగా బరువు తగ్గుతారు.అందువలన కరక్కాయతో ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి.