పైల్స్ సమస్య రాకుండా వుండాలంటే ఇవి అస్సలు తినొద్దు?

Purushottham Vinay
ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా పైల్స్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.సుదీర్ఘమైన మలబద్ధకం, ఊబకాయం ఇంకా గంటల తరబడి కూర్చోవడం లేదంటే నిలబడటం వల్ల ఈ పైల్స్ వ్యాధి వస్తుంది.మలబద్ధకం వల్ల పైల్స్, ఫిషర్స్ ఇంకా ఫిస్టులాస్ ఏర్పడతాయి.ఇంకా మలబద్ధకం వలన జీర్ణక్రియ ప్రక్రియ క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి గర్భధారణ సమయంలో స్త్రీలను తెగ ఇబ్బంది పెడుతుంది.కాగా పాయువు చుట్టూ దురద ఇంకా పాయువు చుట్టూ జిగట అనుభూతి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు నొప్పి, అసౌకర్యం, రక్తస్రావం ఇంకా పాయువు దగ్గర వాపులాగా రావడం అనేవి పైల్స్ వ్యాధి లక్షణాలు. అయితే ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీలో కనుక పైల్స్ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్ ఇంకా అలా గే పిజ్జాలు వంటి ఆహార పదార్ధాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వీటిని తినడం వలన జీర్ణవ్యవస్థ అనేది బాగా బలహీనపడిపోతుంది.

ఫలితంగా మలబద్ధకం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.ఇంకా అలాగే పైల్స్ సమస్య ఉన్నవారు వైట్ బ్రెడ్ తీసుకోవడం మానేయాలి.వైట్ బ్రెడ్ తినడం వలన మలబద్ధకం సమస్య బాగా పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండితో తయారుచేసిన వైట్ బ్రెడ్ జీర్ణక్రియను బాగా పాడు చేస్తుంది.ఇక మీరు హేమోరాయిడ్స్ లక్షణాలతో బాధపడుతుంటే, ఆహారంలో టీ ఇంకా కాఫీలు తాగకూడదు.టీ, కాఫీలు తీసుకోవడం వల్ల పైల్స్ లక్షణాలు చాలా తీవ్రమవుతాయి. అయితే హెర్బల్ టీని మీరు తాగవచ్చు.ఇంకా అలాగే పైల్స్‌ ఉన్నవారు మత్తు పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. సిగరెట్ తాగడం , మందు తాగడం,గుట్కాలు ఇంకా అలాగే పాన్ పరాక్ లు నమలడం లాంటివి అస్సలు చేయకూడదు.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న ఫుడ్స్ అవాయిడ్ చేసి పైల్స్ సమస్య రాకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: