లైఫ్ స్టైల్: బరువు తగ్గాలనుకునే వారికి ఈ జ్యూస్ తప్పనిసరి..!!

Divya
ఇటీవల కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అధిక బరువుకు కారణం అవుతూ మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆహార శైలిలో మార్పులు, జీవనశైలిలో ఊహించని పరిణామాల కారణంగా ఇలా బరువు పెరగడం సహజమైపోయింది. ఒకవేళ బరువు పెరిగిన తర్వాత ఆ బరువును తగ్గించుకోవడం కోసం చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం చెందుతూనే ఉన్నారు. అంతేకాదు బరువు తగ్గే క్రమంలో క్రమంగా అనారోగ్యం పాలవుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు.
ఎటువంటి కష్టం లేకుండా సునాయాసంగా బరువు తగ్గి.. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే రాగి జావా తప్పనిసరిగా తాగాలి. రాగి జావను త్రాగడానికి ఇటీవల కాలంలో చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాల కారణంగా అధిక బరువును ఇట్టే సులభంగా తగ్గించుకోవడం గమనార్హం. ప్రతిరోజు ఉదయాన్నే దోస , ఇడ్లీ అంటూ డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం కంటే రాగి జావా,  ఓట్స్ లాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు తీసుకోవడం కంటే రెండు రోజులకు ఒకసారి ఉదయాన్నే రాగి జావా,  ఓట్స్ , మిల్లెట్ జావా లాంటివి తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి
ఇక ప్రతిరోజు ఇలాంటి జావా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పొటాషియం,  ఫైబర్, విటమిన్స్ లభిస్తాయి. ఇకపోతే రాగి జావ తీసుకోవడం వల్ల 336 కేలరీలు లభిస్తాయి. ప్రతిరోజు తీసుకోవడం కంటే రెండు రోజులకు ఒకసారి తీసుకుంటే మరింత మంచిది అని,  త్వరగా ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు అధికంగా తినాలనే భావన కలగదు. పైగా బరువు త్వరగా తగ్గుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వారంలో రెండుసార్లు మీరు రాగిజావ తీసుకోవడం వల్ల అధిక బరువును ఆరోగ్యంగా తగ్గించుకోవచ్చు. కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అలాగే వ్యాయామం, ఎక్సర్ సైజ్ , వాకింగ్ చేయడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: