లైఫ్ స్టైల్: వామ్మో పుదీనాతో అన్ని ప్రయోజనాలా..?

Divya
సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది పుదీనాను ఎక్కువగా బిర్యాని, చికెన్ కర్రీ వంటి మసాలా ఐటమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక మరి కొంతమందికి దీని వాసన అన్నా కూడా సరిపోదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం పుదీనా తినడం ప్రతి ఒక్కరూ ప్రారంభిస్తారు. పుదీనా సాగుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. మీ పెరట్లో ఒక చిన్న మొక్క అలా వేసినా సరే ఇలా గుంపులు గుంపులుగా వచ్చేస్తూ.. పెరటి మొత్తం అల్లుకుంటుంది. ఈ ఆకు పెంచడానికి ఖర్చు లేదు.. కానీ లాభాలు మాత్రం చాలా ఎక్కువగా లభిస్తాయి. మరి పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది కూడా ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
పుదీనాలో లభించే పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ,  విటమిన్ బి  కాంప్లెక్స్,  విటమిన్ సి,  పొటాషియం,  మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక జీర్ణ ఎంజైములను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడేలా చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల పొట్టకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక పుదీనాలో మనకు మెంథాల్ అనే  సమ్మేళనం ఎక్కువగా లభిస్తుంది ఇది గ్యాస్, కడుపుబ్బరం , మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక పొట్ట కండరాలను సడలించి ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది.
ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారు పుదీనా ఆకులను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే తప్పకుండా పుదీనాను ప్రతిరోజు నమలాలి. ఇక యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, మానసిక పరిస్థితి బాగో లేకపోవడం లాంటి ఎన్నో సమస్యలకు కూడా పుదీనా చాలా చక్కగా సహాయపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి పుదీనా వల్ల ఇన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే మీరు విరివిగా పుదినాను.. తగిన మోతాదులో ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: