లైఫ్ స్టైల్: ఎముకలు బలంగా మారాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న పిల్లలు కూడా కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల తోపాటు ఎముకల నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కూర్చున్నా.. నిల్చున్నా ఇలా ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోంది. కీళ్ల నొప్పుల కారణంగా చాలామంది నేలపై సరిగ్గా కూర్చో లేకపోతున్నారు. ఇక దీనంతటికి కారణం ఆహారంలో పోషకాల లోపం అని చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే ఇలాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇకపోతే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం
బీన్స్:
ముఖ్యంగా రెగ్యులర్ గా చూసే బీన్స్ ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి. ఎముకలు బలంగా మారాలి అంటే పోషకాలతో నిండిన బీన్స్ తినాలని వైద్యులు చెబుతుంటారు . వీటిలో క్యాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. కిడ్నీ బీన్స్ తో పాటు ఎడామామ్ వంటివి తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు నుంచి దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నువ్వులు:
నువ్వులలో ఫాస్పరస్, క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. ఇందులో ఉన్న పోషకాలు ఎముకలను మరింత దృఢంగా మార్చి కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తాయి. కాబట్టి నువ్వులను ప్రతిరోజూ మీ ఆహారంలో ఒక భాగం చేర్చుకోవడం మంచిది.
రాగులు:
రాగులు కూడా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాగులలో వుండే పోషకాలు ఎముకలను స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడతాయి. క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది అద్భుతమైన శక్తిని రాగులు అందిస్తాయి . ఇక రాగులతో రకరకాల వంటకాలు తయారు చేసుకొని తినవచ్చు
ఇక వీటితో పాటు ఎముకలను దృఢంగా మార్చే మరి కొన్ని ఆహారపదార్థాలు ఏమిటంటే వాల్నట్ ,బచ్చలికూర, పైన్ ఆపిల్, అరటి పండ్లు , బొప్పాయి వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: