లైఫ్ స్టైల్: ఈ ఆకుతో చర్మ సమస్యలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా పరార్..!!

Divya
ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో మొక్కలలో మునగ మొక్క కూడా ఒకటి. ముఖ్యంగా మునగాకు మనం కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే చూస్తాము. కానీ చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక పోతే మునగాకు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం..
మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంపొందించే శక్తి మునగ కాయలకి ఉంది . అందుకే మునగకాయలను సంతానం కోసం ఎదురు చూసే వారు ఎక్కువగా తినాలని వైద్యులు సిఫార్సు చేస్తూ ఉంటారు. ఆడవారిలో వచ్చే థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవాలంటే వారానికి రెండుసార్లు తప్పకుండా మునగాకు తో చేసిన ఏదైనా కూర తప్పకుండా తినాలి. ముఖ్యంగా మునగ ఆకులను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు కాబట్టి మునగ ఆకులను తినడం వల్ల థైరాయిడ్ పనితీరుకు సహాయపడే సెలీనియం , జింక్ వంటి పోషకాలు మనకు మునగ ఆకుల ద్వారా లభిస్తాయి. ఇక అంతే కాదు విటమిన్ ఏ ,విటమిన్ బి, విటమిన్ సీ, విటమిన్-ఇ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. థైరాయిడ్ హార్మోను ఉత్పత్తికి ఈ పోషకాలు బాగా సహాయపడుతాయి.
ఇకపోతే మల బద్ధకం , నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక మునగ ఆకులతో పొడి తయారు చేసుకొని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇక ఒక టేబుల్ స్పూన్ మునగ పువ్వుల రసాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగినా కూడా ఉబ్బసం,  అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. ఇక చర్మానికి కూడా చక్కగా ఈ మునగ ఆకు పని చేస్తుంది. మునగాకు రసం లోకి నువ్వుల నూనె కలిపి నీరంతా ఆవిరయ్యే వరకూ బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి గజ్జి,తామర, దురద వంటి చర్మ సమస్యలు ఉన్నచోట పైపూతగా రాసినట్లయితే చర్మ సమస్యలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: