గుండె స్పీడ్ గా కొట్టుకుంటుందా? అయితే ప్రమాదమే!

Purushottham Vinay
ఏదైనా ఘటన జరిగినప్పుడు, భయపడినప్పుడో, బాగా కష్టపడినప్పుడో ఇంకా పరుగెత్తినప్పుడో గుండె కొట్టుకోవడం సహజం. కానీ ఏమీ లేకుండా కూడా గుండె వేగంగా కొట్టుకుంటోందంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇలా నిత్యం గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తే వైద్యులను మీరు కచ్చితంగా సంప్రదించాల్సిందే.ఇక సాధారణ వ్యక్తి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ కొందరికీ మాత్రం నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకుంటోంది. ఇలా ఎల్లప్పుడూ కొట్టుకోవడం అసలు మంచిది కాదు. దీన్ని 'టాకీ కార్డియా' అని అంటారు.దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎప్పటికైనా కానీ మీ గుండెకు ముప్పుగా మారుతుంది.ఇక గుండె అధికంగా కొట్టుకోవడానికి కొన్ని అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు. రక్తహీనత, బీపీ తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, జ్వరం, డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఇంకా అలాగే మద్యం తాగడం, ధూమపానం, డ్రగ్స్ వాడడం ఇంకా టీ, కాఫీలు అధికంగా తాగడం ఇలాంటి కారణాల వల్ల కూడా గుండె వేగం పెరిగిపోతుంది.


కొన్ని రోజుల పాటూ ఈ పరిస్థితి కనుక కొనసాగితే దానికి కచ్చితంగా చికిత్స చాలా అవసరం. లేకుంటే ఏ క్షణమైన కానీ హార్ట్ ఫెయిలయ్యే పరిస్థితి మీకు ఏర్పడవచ్చు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా గుండె జబ్బులు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి కాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు.కార్డియాలజిస్టులు ముందు మీ గుండె కొట్టుకునే రేటును బాగా పరిశీలిస్తారు. దాని తరువాత ఈసీజీ, ఎక్స్ రే ఇంకా ఎకో టెస్ట్ వంటివి సూచిస్తారు. దీంట్లో ఇక మీ గుండె పరిస్థితి వారికి పూర్తిగా అర్ధమైపోతుంది. దీని వల్ల పరిస్థితి చేయి దాటక ముందే ఇక మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఛాతీలో నొప్పిగా అనిపించినా ఇంకా తల తిరగడం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటివి తరచచూ అనిపిస్తున్నా కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అన్ని కూడా హార్ట్ ఎటాక్ కు సంబంధించిన లక్షణాలు.గుండె కొట్టుకునే వేగం పెరిగినట్టు కనుక అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడంపై మాత్రం అశ్రద్ధ చేయవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: