లైఫ్ స్టైల్: డైట్ లో భాగంగా రాత్రి భోజనం మానేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రకరకాలుగా ఆహార పదార్థాలలో నియమ నిబంధనలు పాటిస్తూ.. ఒక్కొక్కసారి మూడు పూటల లో ఒక పూట భోజనం చేయడం మిస్ చేస్తూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారం వదిలేస్తే ఎంత నష్టం అయితే కలుగుతుందో.. రాత్రి సమయంలో భోజనం తినకపోయినా అంతే నష్టం కలుగుతుందట. రాత్రి సమయంలో భోజనం చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఎదురవుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
రాత్రిపూట భోజనం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు నిద్ర కూడా భంగం వాటిల్లుతుంది. ఎప్పుడైతే ఖాళీకడుపుతో నిద్ర పోతారో అప్పుడు దాని ప్రభావం నిద్ర పై పడి నిద్రలేమి సమస్యకు దారి తీయవచ్చు. ముఖ్యంగా శరీరానికి కావలసిన పోషకాలు, అవసరమైన క్యాలరీలు కూడా శరీరానికి లభించవు. అందుకే నిద్ర ను నియంత్రించే హార్మోన్ లు మెలటోనిన్.. సెరోటోనిన్ లను ఉత్పత్తి చేయడానికి తగిన సంఖ్యలో క్యాలరీలను పొందడం కూడా కఠినతరం అవుతుంది. ముఖ్యంగా పోషకాల లోపం వల్ల కావలసినంత నిద్ర లభించకపోగా.. నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక పోతే నిద్ర సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇక శరీరంలో విటమిన్-డి లోపిస్తుంది. అలాగే నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇక ఒక్కరోజు సరిగ్గా నిద్ర లేకపోతే మరుసటి రోజు దాని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుందని చెప్పవచ్చు. మానసిక స్థితి, శక్తి అనేది జీవక్రియ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.. ముఖ్యంగా నిద్ర అనేది మనస్సు, శరీరాన్ని బూస్ట్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి నిద్రను ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే తగిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే రాత్రి సమయంలో పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: