సమ్మర్ : కడుపుని చల్లగా ఉంచే జ్యూసులు ఇవే!

Purushottham Vinay
వేసవి కాలంలో కడుపుని చల్లగా ఉంచే పండ్లు చాలా రకాలు ఉన్నాయి. వీటి నుంచి జ్యూస్‌ని చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇక ఈ జ్యూస్‌లు పొట్టని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా అలాగే శరీరాన్ని కూడా హైడ్రేట్‌గా  ఉంచుతాయి. ఇక అలా ఉంచే అటువంటి 3 జ్యూస్‌ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఎండాకాలంలో నిమ్మరసం అనేది శరీరానికి చాలా మంచిది. దీనిని తయారుచేయడం కూడా అన్నిటికంటే చాలా సులభం. అంతేకాదు ఈ జ్యూస్ తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. దీని కోసం నిమ్మకాయ, పంచదార ఇంకా అలాగే బ్లాక్ సాల్ట్ బాగా మిక్స్ చేయాలి. అలాగే ఈ మిశ్రమంలో కొన్ని సోడా నీటిని కూడా కలపాలి. అప్పుడు అది చాలా రుచిగా తయారవుతుంది. అలాగే కొన్ని పుదీనా ఆకులను కూడా ఇందులో జోడించవచ్చు.ఇంకా అలాగే బేల్ రసం కూడా కడుపుకి చాలా మంచిది. అలాగే దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.


ఈ రసం చేయడానికి మిక్సర్ కూడా అసలు అవసరం లేదు. ఇక ఒక గిన్నెలో దాని గుజ్జును తీసి కొన్ని నీటిని కలపాలి. రుచి కోసం కొంచెం ఉప్పు, చాట్ మసాలా ఇంకా అలాగే చక్కెరను కూడా ఇందులో మీరు కలపవచ్చు. ఆ తరువాత తరువాత దీనిని ఫిల్టర్ చేసి ఐస్ క్యూబ్స్ ని జోడించి సర్వ్ చేస్తే సూపర్ గా ఉంటుంది.అలాగే పుచ్చకాయ రసం కూడా వేసవిలో అత్యంత రుచికరమైన ఇంకా అలాగే హైడ్రేటింగ్ పానీయం. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం.ఈ రసం తాగడానికి చాలా రుచిగా ఉంటుంది.ఇక దీన్ని చేయడానికి పుచ్చకాయ గింజలను తీసివేసి వాటిని మిక్సర్‌లో వేసుకోని బాగా రుబ్బుకోవాలి. కొంత చక్కెర ఇంకా అలాగే నల్ల ఉప్పు కలపాలి. ఆ తరువాత ఫిల్టర్‌ చేసి ఐస్ క్యూబ్స్ ని కూడా వేసి సర్వ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: