పెళ్లిలో తలంబ్రాల వెనక.. ఇంత స్టోరీ ఉందా?

praveen
పెళ్లి అంటే ఒక మధురమైన జ్ఞాపకం. నిండు నూరేళ్ల జీవితానికి  ఒక పునాది లాంటిది పెళ్లి. కోటి ఆశలతో వధువు మెట్టినింట అడుగుపెట్టి సరి కొత్త జీవితాన్ని పెళ్లి తర్వాత ప్రారంభిస్తూ ఉంటుంది. ఇలా పెళ్లి అనే రెండు అక్షరాల పదం వెనుక ఏకంగా రెండు జీవితాల ఆనందం సుఖదుఃఖాలు ముడిపడి ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగా వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రులందరికీ సమక్షంలో కొత్త జంటలు ఒక్కటి అవుతూ ఉంటాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి తంతు ఎలా జరుగుతుంది అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఎదుర్కోలు, జీలకర్ర బెల్లం కన్యాదానం లాంటివి ఘట్టాలు  హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

 అలాగే పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం లాంటి ఘట్టం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే తలంబ్రాలు పోసుకునే సమయాన్ని అటు నూతన వధూవరులు అందరూ కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఇక తమకు పెళ్లి జరిగి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాము అన్న ఆనందంలో ఒకరి పై ఒకరు పోటీ పడి మరీ తలంబ్రాలను పోసుకుంటూ ఉండడం మనం పెళ్లిళ్లలో చూస్తూనే ఉంటాం. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి పెళ్లి లో ఇలా తలంబ్రాలు పోసుకోవడం మాత్రం సర్వసాధారణమని చెప్పాలి. కానీ తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

 తలంబ్రాలు పోసుకోవడం వెనక అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా తలంబ్రాలు పోసుకునే సమయంలో మొదట కొబ్బరి కుడకలో బియ్యం పోసి అయ్యగారు వేదమంత్రాలు చదువుతూ ఉంటారు. తర్వాత కొబ్బరి కుడుకలో బియ్యం ఒకరిపై ఒకరు పోసుకోవాలని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడా పండితుల చదివే వేద మంత్రాలలో ఎన్నో విశేషమైన అర్థాలు ఉంటాయట. అంతేకాదు ఇక పెళ్లి తర్వాత ఉండే సంసార బాధ్యతలు సుఖదుఃఖాలను ఆ వేదమంత్రాలు గుర్తు చేస్తాడట.

 కపిల గోవులను స్మరిస్తూ పుణ్య దానం చేయాలని.. వృద్ధి, శాంతి తుష్టి పుష్టి కలగాలని అన్ని విఘ్నాలు తొలగి పోయి ఆయుష్షు పెరిగి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని.. పిల్లాపాపలతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆస్వాదించాలని తలంబ్రాలు పోసుకునే టప్పుడు పండితులు చదివే మంత్రాలలో అర్థం ఉంటుందట. ఇక తలంబ్రాలు పోసుకోవడం వల్ల జీవితం ఎంతో ఆనందంగా సాగుతుందని చెబుతూ ఉంటారు పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: