'మిలిటరీ హోటల్స్' గురించి తెలుసా.. ?

VAMSI
సాధారణంగా మనము ఆకలి వేస్తే మనకు దగ్గర్లోని మాములు హోటల్స్ లోకి వెళుతుంటాము. అక్కడ దొరికే పదార్ధాలు అన్నీ బాగుంటాయి. కానీ అంత బలమైన ఆహారం ఉండదు. అయితే అన్ని హోటల్స్ ఒకేలా ఉండవు, మిలటరీ హోటల్స్ అనే పేర్లతో ఉన్న హోటల్స్ గురించి మీకు తెలుసా..?? అసలు ఈ పేరుతో హోటల్స్ ఉండడం మీరు విన్నారా..?? మిలటరీ హోటల్స్ అంటే అక్కడ ప్రత్యేకత ఏమిటి..!! వంటల ప్రత్యేకత ఏమిటి..!! అన్న వివరాల్లోకి వెళితే కేరళ , కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పేరిట ఎక్కువగా హోటల్స్ లు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఈ పేరుతో రన్ చేస్తున్నారు అంటే..?? మిలటరీలో సైనికులకు పుష్టిగా ఉండటానికి ఎక్కువగా బలమైన మాంసాహారాన్ని ఇస్తుంటారు. అలాగే ఆరోగ్యకరమైన మంచి శాఖాహారం కూడా వారికి ఇస్తుంటారు.
అలా మిలటరీ హోటల్స్ అంటే అటు మాంసాహారం , ఇటు శాకాహారం రెండు బలంగా రుచిగా లభిస్తాయని అలా కాస్త వెరైటీగా ఉండేలా ఈ పేరును తమ హోటల్స్ కు పెడుతుంటారు. అలాగే మిలటరీ హోటల్స్ వినడానికి కూడా ప్రత్యేకంగా ఉండటంతో ఈజీగా పాపులర్ అవుతాయి. అలా కొన్ని హోటల్స్ కు ఇలా మిలట్రీ హోటల్స్ అని పేర్లు పెడుతుంటారు. ఇలాంటి పేర్లతో ఎక్కువగా కర్ణాటక కేరళ రాష్ట్రాలలో వివిధ హోటల్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం హోటల్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా బాగా డబ్బు అయినా ఫుడ్ సంబంధిత వ్యాపారాలు మళ్ళీ పుంజుకున్నాయి.
అందులోనూ బయట ఫాస్ట్ ఫుడ్ కు ప్రజలు ఇపుడు మరి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో హోటల్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. మరి మీకు ఆ హోటల్స్ గురించి తెలుసుకోవాలంటే... మీకు దగ్గర్లోని మిలిటరీ హోటల్ కు వెళ్ళండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: