సంక్రాంతి స్పెష‌ల్ : భోగ భాగ్యాల భోగిలో ఏముంద‌ని?

RATNA KISHORE
మంచి అనేది యోగం..చెడు అనే భోగం నుంచి త‌ప్పుకు తిర‌గాలి అనుకుంటే మాత్రం మంచిని ప్రేమించి మంచిని సొంతం చేసుకోవాలి. చెడు అన్న‌ది భోగం ఎందుకంటే మ‌నిషి జీవితాల్లో చెడ్డ కాలాలు అన్నీ భోగానికి సంబంధించిన‌వే! చెడిపోయే దారులు చెడ‌గొట్టే అల‌వాట్లు ఇవ‌న్నీ భోగానికి సంబంధించిన‌వే! రాజ్యాలు పోయినా భోగాల‌కు ఏం లోటు లేద‌ని గ‌తంలో ఓ మాట ఉండేది. అంటే భోగం ఓ విధంగా ప్ర‌య‌త్న లేమిని అందిస్తుంది. క‌ష్ట ప‌డ‌ని త‌త్వాన్ని దూరం చేస్తుంది.ఇవే కాకుండా ఇంకెన్నో చెడ్డ విష‌యాలు నేర్పిస్తుంది. మంచి అన్న‌ది యోగం క‌నుక ఓ గొప్ప సంద‌ర్భంలో మ‌నిషి రాణించేదంతా మంచే అయి ఉంటుంది. ఉండాలి కూడా!
పండ‌గ సంద‌డి మ‌ధ్య‌లో కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.పండ‌గ సంద‌డి మ‌ధ్య‌లో కొన్ని నేర్చుకోవాలి.జీవితం ఒక్క చోట ఆగిపోవ‌డంలో అర్థం లేదు అని విన్నాను. ఆగిపోవ‌డం వ‌ల్ల ఏమ‌యినా న‌ష్టాలు ఉన్నాయా అన్న‌ది ఎక్కువ‌గా గుర్తింపులో ఉన్న మాట.న‌ష్టాలు ఎలా ఉన్నా లాభాలు ఎంత‌యినా మ‌నం ఓడిపోవ‌డం వ‌ల్ల జ‌రిగే బాధ కొంత ఈ పండుగ తీరుస్తుందా?

 
కొంత కాదు కొంత‌యినా తీరుస్తుందా అని రాయాలి.మ‌నం గెలిచిన‌ప్పుడు విజ‌య గ‌ర్వం వ‌స్తుంది క‌దా అదే పండుగ! భోగి మంటల వేళ నేర్చుకోవాల్సిన వాటిలో అన‌వ‌స‌రం అయిన‌వేవో వ‌దిలేస్తే తెలుసుకోవాల్సింది త‌ప్ప‌క గుర్తుకు వ‌స్తుంది.పండ‌గ  ఏమయినా నేర్పాలి..పండ‌గ పూట ఏమయినా నేర్చుకుని రావాలి..ఈ రెండూ లేకుండా ఏమీ చేయ‌లేం.
భోగి మంట‌ల వేళ మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం దిద్దాలి. మంచి ప‌నులు అంటే చెడును మంట‌ల్లో వేసి బూడిద చేసే ప‌నులు అని అర్థం. మంచి అంటే ఆగ‌మించే కాలంలో లేదు మ‌న క‌ర్త‌వ్య పాల‌న‌తో ముడి ప‌డి ఉంది అని అర్థం.ఒక్క సారి ఆలోచిస్తే మంచి అన్న‌ది జీవితాలను శాసిస్తేనే మేలు.చెడు కాదు శాసించాల్సింది కాల ప్ర‌వాహాన కొట్టుకుపోని మంచి  మాత్రమే! నిలిచి పోయే మంచి మాత్ర‌మే! శాసిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: