హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2022 : మాస్క్ ఫ‌స్ట్ డ్యూటీ నెక్ట్స్ !

RATNA KISHORE
ఆనందంగా జీవించండి హాయిగా ఉండండి  త‌ప్పులు ఏవ‌యినా ఉంటే వాటిని స‌రిదిద్దుకుని కావాల్సినంత స్వేచ్ఛ‌తో పాటు కావాల్సినంత బాధ్య‌త‌తో కూడా న‌డుచుకోండి. ఇవి క‌దా కావాలి..క‌నుక క‌రోనా మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డి లేదా భ‌య‌పడుతున్నాం అన్న భ్ర‌మ‌లో ఉండి కాలాన్ని వెచ్చించ‌కండి. ఎలా అయినా ఎందుకయినా మంచిది భ‌యాన్ని వీడి మాస్క్ తో సుర‌క్షిత జీవితం గ‌డ‌పండి. అప్పుడెప్పుడో అనేవారు ఎయిడ్స్ కు మందు లేదు నివార‌ణ ఒక్క‌టే మార్గం అని అలాంటి రోజు ఈ క‌రోనా విష‌యంలో వ‌స్తుందో రాదో కానీ..దేనికైనా నివార‌ణే మార్గం. రోగం క‌న్నా ముంద‌స్తు నివార‌ణ మ‌రియు నియంత్ర‌ణే ధ్యేయం. ఆధునిక వైద్య శాస్త్రానికి కొత్త ఊపిరి అందించే ఈ వైరాల‌జీ మ‌రిన్ని కొత్త వివ‌రాలు అందించాల‌ని కొత్త ఏడాదిలో కోరుకుందాం. హెరాల్డ్ మీడియా త‌ర‌ఫున ఆరోగ్యక‌ర‌మ‌యిన ఆనంద‌క‌ర‌మ‌యిన ఏడాదికి స్వాగ‌తం.. విషాదాల కాలానికి వీడ్కోలు...


కొత్త ఏడాదికి ఆహ్వానం ప‌లుకుతూనే కొన్ని మంచి ప‌నులు చేయాలి.. కొన్ని మంచి ప‌నుల‌కు కొనసాగింపుగా మ‌నుష్యులంతా ఉండాలి. ఇదే ప్రతిపాద‌న ఇదే ప్రాతిప‌దికతో ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.. మంచి అన‌గా ఇత‌రుల క్షేమం కోరేది. మంచి అనగా ఇత‌రుల‌కు ఏ హానీ చేయ‌నిది. ఈ కొత్త ఏడాది చేసే ప్ర‌తి ప‌ని గొప్ప ఫ‌లితాలకు సంకేతం కావాలి. అంతేకాదు మంచి నిర్ణ‌యాల‌కు ఆన‌వాలు కావాలి. పురోగ‌తి అన్న‌ది జీవితాన్ని శాసించాలి. పురోగ‌తి, ప్ర‌గ‌తి అన్న‌వి మాన‌వ అభ్యున్న‌తికి సంకేతిక కావాలి. మ‌న జీవితాల్లో వ‌చ్చే ప్ర‌తి మార్పూ రేప‌టికి దోహ‌దకారి కావాలి. అటువంటి రోజు కొత్త ఏడాదిలో ప‌ల‌క‌రిస్తే మంచి ప‌రిణామాల‌కు అదే సంకేతిక.


ఏడాదిలో ఆరోగ్యం,కాలంతో చేసే ప్ర‌యాణంలో ఆనందం అన్నవి చాలా ముఖ్యం. అదేవిధంగా కొత్త ప్ర‌ణాళిక‌ల‌తో కూడిన జీవితం కూడా ఎంతో అవ‌స‌రం..ఆవ‌శ్య‌కం. ఈ ఏడాది క‌రిగి కొత్త ఏడాదిలో క‌లిసి పోతుంది. పోత పోసుకున్న క్ష‌ణాలు అన్ని ఏదో ఒక చోట నిలిచి కొత్త అర్థం వెతికి వ‌స్తాయి. మ‌నం మ‌న‌లానే ఉండడం అన్న‌ది సాధ్యం కాని ప‌ని అని చ‌దివేను. ఎవ్వ‌రయినా ఎవ్వ‌రిలానో ఎందుకు ఉండాలి అని అనుకుంటారు కానీ ప్రాభావాల‌ను మాత్రం వ‌దిలిపోవ‌డం కుద‌ర‌ని ప‌ని. కావాల్సినంత స్వేచ్ఛ జీవితం నుంచి తీసుకోవ‌డం ఓ బాధ్య‌త.. అనుభ‌వించ‌డం హ‌క్కు. స్వేచ్ఛ‌ను  అనుభ‌విస్తూ మంచి నిర్ణ‌యాల‌కు ఆన‌వాలుగా నిల‌వ‌డ‌మే ఇప్ప‌టి ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం.


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: