లైఫ్ స్టైల్: ఇవి మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Divya
సాధారణంగా ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం చూసి మరీ ఇంటిని నిర్మిస్తుంటారు. ఒకవేళ వాస్తు దోషాల తో కనుక ఇళ్లు నిర్మించినట్లు అయితే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలకు భయపడే ప్రతి ఒక్కరు తమ ఇంటిని నిర్మించుకునే టప్పుడు వాస్తు శాస్త్రంలో నిపుణుల పర్యవేక్షణలో తమ ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. కేవలం ఇళ్లను మాత్రమే కాదు పూర్వకాలం నుంచి దేవాలయాలను కూడా వాస్తు శాస్త్రం అనుసరించి నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది.

భారతీయ హిందూ పురాతన శాస్త్రం ప్రకారం.. వాస్తు పురుషుడి అభ్యర్థన మేరకు సమస్త మానవాళిని  బాగుచేయడం కోసం బ్రహ్మ దేవుడు వాస్తు-శాస్త్ర నియమాలు సృష్టించాడు అని శాస్త్రం చెబుతోంది. అందుకే మీరు ఇంటి నిర్మించుకునేటప్పుడు ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇంటిని నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. పొరపాటున వాస్తు దోషం తో మీ ఇల్లు నిర్మించినట్లు అయితే ఎన్నో కలహాలు కష్టాలు వస్తాయి కాబట్టి, అలాంటి పరిస్థితులలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని పద్ధతుల ద్వారా వాస్తు దోషాలను తొలగించవచ్చు.
అరోవానా ఫిష్:
వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా వస్తువులను మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల కొన్ని వస్తువుల వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే, మరికొన్ని వస్తువులు నెగిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లోకి వస్తాయని సమాచారం.అయితే మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే గోల్డెన్ ఫిష్ తోపాటు అరోవానా ఫిష్ లను కూడా ఉంచుకోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయట.

ఈ అరోవానా చేపను అష్టైశ్వర్యాలకు,  శక్తికి ప్రతీకగా, చిహ్నంగా కొలుస్తారు అట . అందుకే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఈ రకమైన చేపలను పెంచుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లోకి వచ్చి సమస్యలు దూరం అవుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: