లైఫ్ స్టైల్: ఇలా చేస్తే తెల్ల జుట్టు పరార్..!

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు గానే జుట్టు పైన కూడా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు . ఇకపోతే ఇటీవల కాలంలో వయసు తో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు తెల్లగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడుతుంది. విపరీతమైన టెన్షన్, తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వంటి కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా అయ్యే అవకాశాలు ఉన్నాయట. మార్కెట్లో దొరికే రకరకాల రసాయనాలు కలిగిన షాంపూ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల జుట్టు త్వరగా తెల్ల పడిపోతుంది. ఈ జుట్టును నల్లగా చేసుకోవడానికి మార్కెట్లో దొరికే డై షాంపూ లను ఉపయోగిస్తున్నారు. ఇక వీటి వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతోంది..

అయితే పూర్వకాలం పెద్దలు చెప్పిన ఒక చిట్కాను పాటించడం వల్ల జుట్టు నల్ల బడుతుందట. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మీ జుట్టుకు సరిపడా కొద్దిగా ఆవనూనె, ఇక అంతే నిష్పత్తిలో ఆముదం నూనె వేసి బాగా కలపాలి . ఆ తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మూడు బాగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇక ఈ మూడూ జుట్టుకు బాగా పట్టేలాగా జుట్టు కుదుళ్లకు అప్లై చేసి, 15 నిమిషాల పాటు సుతిమెత్తగా మసాజ్ చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించి, ఒక పలుచటి క్యాప్ లాగా ధరించి నిద్రపోవాలి. గోరువెచ్చని నీటితో తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు రాలిపోయే సమస్య నుంచి జుట్టు తెల్లబడే సమస్య వరకు అన్నీ ఇట్టే తొలగిపోతాయి.
వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు నల్లబడటమే కాకుండా జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి.. అంతే కాదు చుండ్రు వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: