లైఫ్ స్టైల్: మధ్యాహ్నం పడుకునేటప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు..?

Divya
నిద్ర అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం.. ప్రతి ఒక్కరూ రాత్రి సమయాల్లో కచ్చితంగా నిద్ర పోవాలి.. లేదంటే చాలా అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవరు సమయాన్ని కేటాయించలేదు. అయితే ఇక మధ్యాహ్న సమయాల్లో నిద్ర పోయేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
మధ్యాహ్న సమయాలలో మనం భోజనం చేసిన తర్వాత చాలా మంది నిద్రపోతూ ఉంటారు. ఇక అలా నిద్రపోవడం మంచిదే.. కానీ రాత్రి సమయాలలో పడుకోవడం ఇంకా మంచిది అని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం వేళ నిద్ర రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. ఎక్కువ భోజనం తిన్న తర్వాత శరీరంలో క్లోమం హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అందుచేతనే ఈ హార్మోన్లు ప్రతి మనిషికి ఎక్కువ నిద్రను అందిస్తాయి.
ఒకవేళ ఎవరైనా మధ్యాహ్న సమయాల్లో నిద్రపోకూడదు అనుకుంటే గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర ను పూర్తిగా దూరం అవుతుంది. లేదంటే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల నిద్ర మటుమాయం అవుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రాత్రి సమయాలలో పడుకోవడం మంచిది అని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒకవేళ మనం పడుకొని ఒక గంట సేపు ముందు ఇలాంటి పనులు అసలు చేయకూడదు అని తెలియ జేస్తున్నారు నిపుణులు. అది ఏమిటంటే ముఖ్యంగా మనం గోరువెచ్చని నీటితో స్నానం చేయకూడదు. ఇక నిద్రపోయేముందు అసలు టీవీ చూడకూడదు, మొబైల్ వంటి పరికరాలు వాడకూడదు..ముఖ్యంగా వీడియో గేమ్స్ వంటివి అస్సలు ఆడకూడదు.. ఇక ఇలాంటి జాగ్రత్తలు పిల్లలకైనా పెద్దలకైనా సరే పాటిస్తే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

మనం పడుకునే ముందు నిశ్శబ్దమైన వాతావరణంలో పడుకోవడం ఉత్తమం. ఒకవేళ పిల్లలు పడుకునే సమయాలలో వెలుతురు చిన్నగా వచ్చేటువంటి రూమ్ లో పడుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: