సెప్టెంబర్ టూర్ : ఈ 5 ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వద్దు

Vimalatha
సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. తేలికపాటి వర్షంతో మొదలయ్యే సెప్టెంబర్ నెల పర్యాటకులకు బాగా నచ్చుతుంది. ఈ నెలలో వరుసగా సెలవులు వస్తాయి. అనంత చతుర్దశి సందర్భంగా ఈనెల 10న, సెప్టెంబర్ నెలలో 11న శనివారం, 12న ఆదివారం కూడా సెలవు. ఈ సెలవుల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ఫ్లవర్ వ్యాలీ
ఫ్లవర్ వ్యాలీ ఉత్తరకాండ్ లో చాలా అందమైన ఉద్యానవనం. ఈ ప్రదేశం సెప్టెంబర్ లో సందర్శించడానికి అద్భుతంగా ఉంటుంది. ఈ లోయ జూన్ నుండి అక్టోబర్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత భారీగా పెరిగిన చలి, మంచుతో కప్పబడి ఉంటుంది. వర్షాకాలం తర్వాత పూలు పూర్తిగా వికసిస్తాయి. దాదాపు మూడు వందల ఆల్పైన్ పువ్వులు ఉంటాయి. అంతేకాకుండా 600 జాతుల యాంజియోస్పెర్మ్ లు, సుమారు 30 జాతుల స్టరిదో ఫైట్లు ఉంటాయి.
శ్రీనగర్
శ్రీనగర్ భూమిపై స్వర్గం అని చెప్పొచ్చు. సెప్టెంబర్ నెలలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ సమయంలో శ్రీనగర్
ను వీక్షించడానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కాశ్మీర్ నడిబొడ్డున శ్రీనగర్ ఉంటుంది. అక్కడ ఎత్తయిన శిఖరాలు, అందమైన లోయలు, తోటలు సరస్సులు చూడొచ్చు. నీటిపైన ఉండే హౌజ్ బోట్ షికారా చాలా ప్రసిద్ధి.
అమృత్సర్
పంజాబ్ లోని అమృత్సర్ నగరం సెప్టెంబర్ లో శిక్షించడానికి అత్యద్భుతంగా ఉంటుంది. అమృత్సర్ అంటే తేనె లాంటి పవిత్రమైన సరస్సు అని అర్థం. ఇది సిక్కు సమాజానికి పవిత్రమైన, మతపరమైన ప్రదేశం. భారతదేశ సరిహద్దుల్లో ఉన్న అమృత్సర్లో చాలామంది స్వర్ణ దేవాలయం చూడడానికి వెళ్తారు. అక్కడ షాపింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు.
వారణాసి
ఉత్తర ప్రదేశ్ లోని ప్రసిద్ధ నగరం వారణాసి. అక్కడ ప్రశాంతమైన ఘాట్లలో ఆధ్యాత్మికత ఉట్టి పడుతుంది. ప్రపంచమంతా ఎంత తిరిగినా ఇలాంటి అద్భుతమైన నగరాన్ని చూడలేము. కాశీ విశ్వనాథుని ఆలయం, సంకట్ మోచన్ దేవాలయం, భారత మాత ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించి వచ్చు.
ఉదయపూర్
రాజస్థాన్ లోని ఉదయపూర్ నగరం సెప్టెంబర్లో పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశాన్ని సరస్సుల నగరం అని కూడా అంటారు ఈ రాజ నగరం ఒక సరస్సు ఒడ్డున ఉంది. ఇక్కడ సిటీ ప్యాలెస్, జానపద మ్యూజియం, వింటేజ్ కార్ మ్యూజియం సందర్శించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: