లైఫ్ స్టైల్ : కూరగాయలు చాలాకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ..?
మీకు కావలసిన కూరగాయలు ఏవైనా కొనుగోలు చేయండి. ముఖ్యంగా కేవలం ఆ సీజన్ లో మాత్రమే పండే కూరగాయలు అయితే, వాటిని మీరు తీసుకొని సీజన్ అయిపోయాక కూడా అదే కూరగాయలతో ఇంట్లో వండుకుని తినవచ్చు.ఇలా చేయడంవల్ల ఆ సీజన్ కాకపోయినా ఆ కూరగాయలు తింటూ మీరు ఎంజాయ్ చేయొచ్చు.
అయితే ఇందుకోసం మీరు చేయవలసిందల్లా మార్కెట్ వెళ్లి మీకు కావలసిన కూరగాయలు తీసుకొని, శుభ్రంగా కడిగి ,ఒక తువ్వాలు తో నీట్గా తుడిచి వేయాలి. ఉదాహరణకు ఒక వేళ మీరు క్యారెట్ ను గనుక నిల్వ ఉంచుకోవాలి అని అనుకున్నట్లయితే, వాటి పైన ఉన్న తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేయాలి. ఇక ఇవే కాదు ఒకవేళ బీన్స్ కూడా మీరు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి..
ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని, అందులో 75శాతం నీళ్ళు పోసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేయాలి. ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ల ఉప్పు వేసి బాగా కలపాలి. హై ఫ్లేమ్ మీద ఒక్కసారి ఈ గిన్నెను పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి మార్చండి. ఇక మీరు ముక్కలుగా చేసుకున్న కూరగాయలనుఉడికించి ,పక్కకు తీసి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కూరగాయలను వెంటనే చల్లని నీటిలో వేసి, కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేయాలి. పదినిమిషాల పాటు ఉంచిన కూరగాయలను.. టవల్ మీద వేయాలి.
మరో పదిహేను నిమిషాలు గాలికి ఉంచి, జిప్ బ్యాగు తీసుకొని అందులో కొద్దిగా కూడా గాలి లేకుండా కూరగాయలను వేసి నిల్వ ఉంచుకోవచ్చు. ముందుగా గాలి లేకుండా జిప్ ని క్లోజ్ చేయడం మాత్రం మర్చిపోరాదు. అయితే ఇలా చేయడం వల్ల సుమారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఈ కూరగాయలు కుళ్ళి పోకుండా ఉంటాయి.