లైఫ్ స్టైల్: కరివేపాకుని ఇలా తింటున్నారా.. ఇక అంతే !

Divya
కరివేపాకు మనకు సహజంగానే దొరుకుతుంది. అయితే ప్రస్తుతం కాయగూరలు మార్కెట్లలో కొనుగోలు చేసి మరీ తెచ్చుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పెంచుకునేవారు. ఇక అసలు విషయానికొస్తే కరివేపాకును కూరలలో, మజ్జిగలో ఎక్కువగా వేసుకుంటాము. అయితే కరివేపాకును ఎలా తినాలో తెలుసుకుందాం.

కరివేపాకు తినడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు ఉదయం పూట కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కరివేపాకు మొదట్లో చేదుగా ఉన్నా, తినగతినగ అలవాటు పడిపోతాం. కరివేపాకు సువాసనను కలిగిస్తుంది బాగా. అయితే ఇటువంటి కరివేపాకులను కొంతమంది తినకుండా బయటికి పారేస్తూ ఉంటారు.
కరేపాకు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు. జుట్టు రాలే సమస్య ఉన్నవారు కరివేపాకు ప్రతి రోజు 4 లేదా 5 ఆకుల నమ్మడం వల్ల, జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇలా కరివేపాకు తిన్న తర్వాత ఒక గంట వరకు నీరు తాగకుండా ఉండాలి. ఇక ఇందులో ఉండేటువంటి ఐరన్, విటమిన్-సి వంటివి జుట్టు రాలే సమస్యను  తగ్గిస్తాయి.

కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.మధ్యాహ్న సమయంలో ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల, అది జీర్ణవ్యవస్థలోకి వెళ్లి ఎంజైమ్ లని మెరుగుపరిచేలా చేస్తాయి. తద్వారా మూత్రనాళం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఏదైనా తిన్నప్పుడు అరగక వాంతులు వచ్చేవారికి, వీటిని నమలడం  వల్ల తగ్గిపోతాయి. ఇక అంతే కాకుండా సన్నబడాలి అనుకునేవారు, వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే చెడు పదార్థాలను, కొవ్వు పదార్థాలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఇక ఈ కరివేపాకు లో ముఖ్యంగా చెప్పుకోవలసినది కంటి సమస్య ఉండేవారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చదువుకునే పిల్లలు ముఖ్యంగా వీటిని తినడం మంచిది. అందరికీ అందుబాటులో ఉండే ఈ కరివేపాకును తినడం వల్ల మనకు మంచి ఫలితాలు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: