సబ్బు గురించి ఈ 5 విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Suma Kallamadi
మానవుడు ఎంతో కాలం నుంచి సబ్బులపై ఆధారపడుతున్నాడు. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా.. దుస్తుల మురికి పోగొట్టాలన్నా.. అందరూ సబ్బులపైనే ఆధారపడి ఉంటారు. సబ్బు లేకపోతే రోజు గడవదని చెప్పుకోవచ్చు. రోజుని ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా ప్రారంభించాలంటే సబ్బుతో స్నానం చేస్తే చాలు. అయితే మన జీవితాల్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న సబ్బు గురించి 5 ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

1. సబ్బు కనీసం 4,800 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు కూడా సబ్బులను వాడేవారు. సబ్బు బైబిల్ కాలం నుంచే అందుబాటులో ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు.  క్రీ.పూ 2800లో బాబిలోన్ నగరంలో మొట్టమొదటి సబ్బును తయారు చేశారని అంటారు.
2. సబ్బులు కేవలం మురికిని కడిగేస్తుంది కానీ అందరూ విశ్వసిస్తున్నట్లు సూక్ష్మక్రిములను నాశనం చేయలేదు. అయితే కొన్ని ప్రత్యేకమైన యాంటీ బాక్టీరియల్ సబ్బులు మాత్రం బ్యాక్టీరియాను చంపగలవు. కానీ అవి వైరస్లను చంప లేవు.
3. ఖతార్‌లోని ఒక ఫాన్సీ సబ్బు కొనుగోలు చేయాలంటే $2000 డాలర్లకు పైగా ఖర్చు పెట్టాలి. అనగా ఒక సబ్బు కొనుగోలు చేయాలంటే మన డబ్బుల్లో లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది. అపరకుబేరులు తప్ప ఈ అత్యంత ఖరీదైన సబ్బులను ఎవరూ కొనుగోలు చేయరేమో. అయితే ఈ సబ్బుని బంగారపు పొడితో తయారు చేస్తారు. అంతేకాదు ఈ సబ్బులు వజ్రాలతో పొదగబడి ఉంటాయి. దీనివల్ల చాలామంది కోటీశ్వరుల దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన సబ్బుగా పేరుగాంచిన ఈ సబ్బులను ఖతార్‌లోని ఓ కుటుంబం ఉత్పత్తి చేస్తుంది.
4. మొదట బట్టలు శుభ్రం చేయడానికి, జంతువుల చర్మవ్యాధులను నయం చేయడానికి సబ్బులు వినియోగించేవారు.
5. సోడియం హైడ్రాక్సైడ్, నూనెలు, కొవ్వులు, వెన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదార్థాలు సేకరించి అత్యంత జాగ్రత్తగా సబ్బులు తయారు చేస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో సహజంగానే సబ్బు లక్షణాలు ఉన్న ఒక మొక్క ఉంది. ఈ మొక్కను 'సోప్ వర్ట్'  ఉంటారు. ఎందుకంటే దాని ఆకులు, వేర్లు సాపోనిన్ కలిగి ఉంటాయి. సాపోనిన్ నురుగును ఉత్పత్తి చేస్తుంది. దీనిని మురికిని కడిగేందుకు ఉపయోగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: