లైఫ్ స్టైల్ : పురుషుల కోసం ప్రత్యేకం..
1. తృణధాన్యాలు:
తృణధాన్యాలలో మన ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. ఇందులో అరికెలు, సాములు, కొర్రలు, సజ్జలు, రాగులు వంటివి తీసుకోవడం ఉత్తమం. అందులోనూ తగిన మోతాదులో తీసుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్లు మన శరీరానికి సమగ్రవంతంగా లభించినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
2. పెరుగన్నం:
పెరుగు.. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అరగని పదార్థం తీసుకున్నప్పుడు, ఈ పెరుగు తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. కాబట్టి మూడు పూటలా మగవారు పెరుగు తినడాన్ని అలవాటు చేసుకోవాలి.
3. బంగాళాదుంపలు:
దుంపలలో అధిక కొవ్వు శాతం ఉంటుందని ,చాలా మంది బరువు పెరుగుతామనే అపోహతో వీటికి దూరంగా ఉంటారు. అయితే ఇందులో విటమిన్ సి, పొటాషియం , స్టార్చ్ లభించడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని గుర్తించుకోవాలి.
4. బాదం గింజలు:
బాదం గింజల్లో మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన 5 నుంచి 6 బాదం విత్తనాలను మగవారు తినడం వల్ల వారిలో సామర్థ్యం పెరుగుతుంది.
వీటితో పాటు మనం తీసుకునే ఆహారంలో బచ్చలికూర, పుచ్చకాయ వంటివి తరచూ తింటూ ఉండటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సిఫార్స్ చేస్తున్నారు.