లైఫ్ స్టైల్: వర్షాకాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడని పదార్థాలు..
సాధారణంగా డయాబెటిస్ అంటేనే అది దీర్ఘకాలిక వ్యాధి. నెమ్మదిగా మన శరీరంలోని ఉన్న అవయవాలను నాశనం చేస్తూ.. చివరికి మనిషి ప్రాణాలను తీసే అతి భయంకరమైన వ్యాధి, అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ డయాబెటిస్ రాకుండా ముందే జాగ్రత్తపడితే మంచిది . కానీ ఒకవేళ వచ్చిన తర్వాత మనం తీసుకునే ఆహారంపై అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి, మనిషి ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అని చెప్పవచ్చు.. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడిన రోగులు, ముందుగా వారి శరీరానికి ఏ ఆహారాలు సెట్ అవుతాయో తెలుసుకోవాలి. అంతే కాదు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..? ఎలాంటివి తినకూడదు..? అనే విషయాలను కూడా గుర్తుంచుకున్నప్పుడే ,శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది..
అంతేకాదు కాలానుసారంగా కూడా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని అంటున్నారు వైద్యులు. అయితే ఈ వర్షాకాలంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటేనే.. మంచిదో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరైతే టైప్ 2 డయాబెటిస్ బారినపడ్డారో.. అలాంటివారు గ్లిసమిక్ ఇండెక్స్ GI 55 కంటే తక్కువ చక్కెర స్థాయి ఉండే ఆహార పదార్థాన్ని, తక్కువ మోతాదులో, ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి తినడం కన్నా.. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలామంది బెల్లంను తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే శరీరంలో వేడిని ఈ బెల్లం పుట్టిస్తుంది. కాకపోతే GI ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బెల్లం కు షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.
కాఫీ, టీ, వంటి వెచ్చదనం ఇచ్చే తీపి మిశ్రమాలను తాగకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ వీటిని తాగాలని అనిపిస్తే , ఇందులో పంచదార కలపకుండా తాగడం ఉత్తమం. అంతేకాదు తేనె ,పిజ్జా, వేడి వేడి ఫ్రై పదార్థాలు వంటివి తినకుండా ఉండటం చాలా మంచిది అని చెబుతున్నారు వైద్యులు.