వామ్మో .. పెరుగులో వీటిని అస్సలు కలుపుకొని తినకూడదట.. !

Satvika
ఎన్ని రకాల వంటలు మనముందు ఉన్నా కూడా పెరుగుతో భోజనం ఫినిష్ చేయకుంటే అస్సలు బాగోదు.. పంచభక్ష పరమాన్నాలు తిన్నా కూడా తిన్నట్లు అనిపించదు అని చాలా మంది అంటున్నారు. పెరుగు రుచి అలాంటిది. ఈ పెరుగు వల్ల శరీరానికి ఎంతో మేలు కూడాను. కాల్షియం అధికంగా ఉన్న పెరుగు బోన్స్ మరియు దంతాల సంరక్షణకు మంచి మెడిసిన్ అనే చెప్పాలి. అందుకే ఏవి పడితే అవి తినడం కన్నా చల్లని చద్దన్నం తినడం మేలని పెద్దలు అంటారు. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు..  అయితే అన్నం తో కాకుండా కొన్ని రకాల పదార్థాలతో పెరుగును  తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. అసలెందుకు తినకూడదు.. తింటే ఏమౌతుంది.. వంటి అంశాలను ఒకసారి చూద్దాం..
పెరుగును చాలా మంది అలానే తింటారు.. లస్సీల రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకుంటారు. పెరుగు వల్లకలిగే మేలు తెలిసిందే. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి. పెరుగును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కానీ దీంతో కలిపి తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయట..పెరుగు, చేప రెండూ అధిక ప్రొటీన్లు కలిగినవే. కలిపి తింటే అజీర్ణంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి. ఇక పెరుగు, పాలు కలిపి అస్సలు తీసుకోకూడదు.

పెరుగు మామిడి పండు.. అసలు తీసుకోకూడదట.. కొన్ని రకాల విషపదార్థాలు శరీరంలో తయారవుతాయి. ఫలితంగా ఎలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు. పెరుగు,అరటి పండు తో కలిపి తీసుకోకూడదని అంటారు. అలా తీసుకోవడం వల్ల ఉదరసమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే పెరుగును పెరుగులాగే తీసుకోవాలి. కొత్త ట్రై చేశారో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఖాయం.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఏదైనా కడుపుకు సరిపోయేలా తీసుకోవాలి. అప్పుడే మనిషి అన్ని విధాలా బాగుంటాడు. అలా కాకుండా దొరికింది కదా అని తింటే విషం అవుతుంది జాగ్రత్త సుమీ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: