ఆ కాయ ఆకుల తో అందాన్ని ఇలా పెంచుకొవచ్చు..

Satvika
మనం నిత్యం తినే కూరగాయలతో అందాన్ని మెరుగు పరుచుకోవచ్చు. బయట తిరిగి కష్టపడటం కన్నా కూడా ఇలా వంటల లో వాడే వాటితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చునో చూద్దాం..

వంట గదిలో ఉండే దొండకాయ ఆకుల తో మరింత అందంగా తయారవచ్చు అని అంటున్నారు. అదెలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ దొండకాయ మన శరీరం ఆరోగ్యం గా ఉండేలా సహాయ పడడమే కాదు ఈ దొండ కాయ ఆకులు పిందెలు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ దొండ కాయని కూరగా చేసుకొని తినడమే కాదు.. చాలా మంది పచ్చివి కూడా తింటారు.. ఇలా పచ్చివి తింటే.. దొండకాయ తో మంచి పోషక విలువ కూడా లభిస్తాయి.


దొండకాయలో మెదడు, నాడీ వ్యవస్థ పని చేసే విటమిన్లు పుష్కలం గా లభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. దొండ కాయ తినడం తో మొదడు యొక్క జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలసట, పని ఒత్తిడి తగ్గించి మెదడు చురుకు గా పనిచేస్తుందని అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి, అధికం గా ఉంటాయి.. ఇవి శరీరం లో క్యాన్సర్ కణాల ను నాశనం చేస్తాయి. తరచూ ఈ దొండ కాయ తింటే క్యాన్సర్ రాకుండా కాపాడు తుంది.


ఈ కాయల ఆకుల లో అధిక మొత్తం లో ఐరన్ ఉండడం తో గర్భణీ స్త్రీల కు మంచి పోష కాహారం.. పచ్చి దొండ కాయ తింటే చర్మం అందం గా మారుతుందని, స్కిన్ ఎలర్జీ వంటివి దరి చేరవని చెబుతున్నారు. గజ్జి లాంటి చర్మ వ్యాధులకు దొండకాయ ఆకుల ను పేస్ట్ లా చేసి చర్మం పై పూత గా వేసుకొంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ముఖం పై ఉండే మచ్చలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు. మీకు నచ్చి నట్లయితే మీరు ట్రై చెయ్యండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: