గోర్లు కొరకడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
చాలా మంది గోళ్ళు కొరకడం తిరిగి వాటిని నమలడం చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది గోళ్లను కొరికి, నములుతారట.. ఇలా గోర్లు కొరకడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి రోజు మీకు ఈ అలవాటు ఉంటే మీ గోళ్ళని అది పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళకి నష్టం కలుగుతుంది. అలానే గోళ్ళని కొరకడం కారణం గా పళ్ళ ను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళు ఊడి పోవడం లాంటివి కూడా దీని కారణంగా సంభవిస్తాయి. అంతే కాదండి తరచు కొరకడం వల్ల వంగి పోతాయి.
గోళ్లు పళ్ళల్లో ఇరుక్కుపోయి దంతాల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అలా చేయడం వల్ల దంతాల సమస్యలు వస్తాయని అంటున్నారు.
చర్మం ఎర్రగా అయిపోవడం, వాపులు రావడం మొదలైనవి వస్తాయి. అలానే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీము మరియు ఎక్కువగా నొప్పి రావడం కూడా జరుగుతాయి.. చర్మం పై ఎన్నో రకాల అలర్జీలు వస్తాయని అంటున్నారు. నోట్లో బాక్టీరియా ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్యాక్టీరియా స్టమక్ లోపలి కి వెళ్లి పోతుంది. వీటివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అంటున్నారు.. జాగ్రత్త సుమీ.. గోర్లు కొరకడం ఇకనైనా మానండి..