ఆపిల్ తో జిలేబీలను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి..
ఈ జిలేబి కి కావలసిన పదార్ధాలు..
ఆపిల్: 1,
పంచదార : 300 గ్రాములు,
కుంకుమ: పువ్వు ఒక గ్రాము,
నెయ్యి: 500 గ్రాములు,
పాలు: 250 మిల్లీ లీటర్లు,
పెరుగు: 100 గ్రాములు,
మైదా : 200 గ్రాములు
తయారీ విధానం..
ఈ జిలేబి లను తయారు చేయడానికి ముందుగా మైదా పిండి లో, పెరుగు లో బాగా నాన పెట్టాలి.. తరువాత 24 గంటల వరకు అలానే వదిలేయాలి. ఇప్పుడు పంచదార తీసుకుని సిరప్ లాగ చేయండి. ఆ తర్వాత దీనిలో పాలు కూడా పోసి అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి మరిగించండి. దాని లో కట్ చేసిన యాపిల్ ముక్కల్ని పిండి లో ముంచి వేయించాలి.. వాటిని పక్కన పెట్టి షుగర్ సిరప్ లో వెయ్యండి. అంతే ఇక యాపిల్ జిలేబి రెడీ అయిపొయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది.. ఇలా వెరైటీ గా చేసుకొంటే చాలా బాగుంటుంది.. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. మీకు ఇలా నచ్చినట్లయితే మీరు ట్రై చెయ్యండి..