పిల్లలు ఎందుకు ఏడుస్తారు..? వారి ఏడుపులో దాగి ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా..!

Divya

సాధారణంగా చిన్న పిల్లలు ఏడవడం సహజం. వారు కూడా సమయాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. కానీ కొంతమందికి ఆ చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక, వారిని ఎలా బుజ్జగించాలో తెలియక సతమతమవుతున్నారు. అంతే కాకుండా చిన్న పిల్లలు ఏడిస్తే, మనకు కూడా బాధ, భయం రెండు వేస్తాయి. కానీ వారి ఏడుపు లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి అని చైల్డ్ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు రోజుకు రెండు నుండి మూడు గంటల పాటు ఏడుస్తారని చెబుతున్నారు..

వారి ఏడుపులో ముఖ్య అర్థం వారు భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని. అలా వారి ఏడుపుకు కారణం, తల్లిదండ్రులకు,వారికి ఏం కావాలో తెలియజేస్తూ ఏడుస్తున్నారు అని అర్థం అని చెబుతున్నారు చైల్డ్ సైకాలజీ నిపుణులు. అంతే కాకుండా పిల్లలు ఏడవడం అనేదాన్ని బట్టి అర్ధాలు ఉంటాయని వారు చెబుతున్నారు.. అయితే పిల్లల ఏడుపుకు గల కారణాలేంటి..? వాటిలో దాగి వున్న అర్థం ఏమిటో..? ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా చిన్న పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఏడుస్తారు. వారికి ఎప్పుడు ఆకలి వేస్తుందో.. అప్పుడు గట్టిగా ఏడుస్తూ విరామం ఇవ్వకుండా ఏడుస్తూనే ఉంటారు. ఒకవేళ వారికి సౌకర్యంగా లేనప్పుడు తల్లిదండ్రులను కూడా భయపెట్టేలా ఏడుస్తారు. అంతే కాకుండా వారికి కడుపు నొప్పి, చెవి నొప్పి వచ్చినప్పుడు కూడా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి అని సూచిస్తూ ఏడుస్తూ ఉంటారు. అందుకే మన పెద్దలు కూడా చెప్తారు పిల్లలు ఏడ్చినప్పుడు వెంటనే వారికి కావలసిన ఆహారాన్ని అందించాలి అని. ఎందుకంటే పసి పిల్లలు నోటితో చెప్పలేరు కదా.. వారికి ఆకలి వేస్తుంది అనే విషయాన్ని మనం ముందుగానే గమనించి, వారికి కావలసిన ఆహారాన్ని అందించాలి. అప్పుడే పిల్లలు ఏడవకుండా ఉంటారు.

అంతే కాకుండా పిల్లలకు ఏమీ తోచక, తల్లిదండ్రుల పక్కనే ఉండాలనే భావనతో ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనతో వారు ఏడ్చినప్పుడు తాపీగా మధ్య మధ్యలో ఆపుతూ  ఉ ఊ.. అంటూ ఏడుస్తారు. ఇలాంటి శబ్దాన్ని తల్లిదండ్రులు కనిపెట్టినప్పుడు వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఎత్తుకోవడం మంచిది.

మరీ ముఖ్యంగా పిల్లల ఏడుపులో చాలా రకాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. పిల్లల ఏడుపును గమనించి, తల్లులు వెంటనే స్పందించాలి. అప్పుడే పిల్లలు మా తల్లిదండ్రులు మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నారనే భావనతో ఉండడంవల్ల వారు ఆరోగ్యంగా  పెరగడానికి దోహదపడుతుంది. అంతే కాకుండా వారిలో గట్టి ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుందని అంటున్నారు నిపుణులు. తల్లి ఒకటి, రెండు నెలల నుంచి బిడ్డపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఏడ్చిన వెంటనే లాలిస్తూ,బుజ్జగిస్తూ వారికి కావలసిన ఆహారాన్ని అందిస్తూ, వాళ్ళు నెమ్మదిగా నిద్రపోయే లాగా చేయాలి. మరీ ముఖ్యంగా తల్లి పాట పిల్లలకు జోల పాట లాంటిది. కాబట్టి ఏడుపు ఆపి నిద్రలోకి జారుకునే అవకాశాలు కూడా ఎక్కువ. మరీ ముఖ్యంగా పిల్లలు ఏడుస్తూ నిద్రపోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించాలి అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: