ప్రేయసి ఉంగరాన్ని దొంగలించి... మరొకరికి దొరకాడు.. కానీ చివరికి?
అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసముండే జోసెఫ్ డేవిస్..ఆరెంజ్ సిటీకి చెందిన యువతినీ ప్రేమించాడు. ఈ విషయం సదరు యువతికి తెలియజేయగా అందుకు ఆమె ఒప్పుకోవడంతో వీరిరువురు ఉంగరాలను మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత జోసెఫ్ తనకు ఫోన్ కాల్స్ కి అందుబాటులో లేకపోవడంతో సదరు యువతికి అనుమానం వచ్చి అతని ఫేస్ బుక్ ఖాతాను చూడగా సదరు యువతి ఒక్క సారిగా షాక్ కు గురయింది. ఫేస్ బుక్ ఖాతాలో జోసఫ్ వేరే యువతితో కలిసి దిగిన ఫోటో ఉండటం చూసి ఎంతో షాక్ అయింది. అదేవిధంగా అమ్మాయి చేతికి ఉంగరం కనిపించడంతో యువతి పరిశీలించి చూడగా జోసెఫ్ తన వేలికి ఉంగరం అని అనుమానం రావడంతో వెంటనే వెళ్లి బీరువా తెరిచి చూసింది. అయితే అందులో ఉంగరం కనిపించకపోవడం తో పాటు మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా కనిపించడం లేదు.
ఒక్కసారిగా బంగారు ఆభరణాలు అన్ని కనిపించకపోవడంతో ఎంతో ఆగ్రహానికి గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని పట్టుకుని నిలదీసింది. అతను తీసుకున్న ఆభరణాల విలువ దాదాపు 6 వేల270 డాలర్లు కావడంతో వాటిలో కొన్ని వెనక్కి తిరిగి ఇస్తానని చెప్పాడు. ఈ విధంగా తనను ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో అతను తనకి కరెక్ట్ కాదని అతనితో తన ప్రేమ బంధాన్ని తెంచుకుంది. ఎట్టకేలకు పోలీసులు రావడంతో అతడిని విచారించగా అసలు విషయం బయట పెట్టారు.డేవిస్.. జో బబ్రౌన్, మార్కస్ బబ్రౌన్ అనే మారుపేర్లతో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని విచారణలో తేలడంతో అతనిపై అరెస్ట్ వారెంటీ జారీ చేశారు.