ప్రేమికులరోజు ఒకటైన నేపాల్ అమ్మాయి.. భారత్ అబ్బాయి..!
అక్కన్నపేట మండలం, మసిరెడ్డి తండాకు చెందిన మాలోతు రమేష్ అనే వ్యక్తి ఎనిమిది సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో తాను చదువుతున్నటటువంటి విశ్వవిద్యాలయంలోనే నేపాల్ కి చెందిన కుమారి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారిరువురి మధ్య ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ కొద్దిరోజుల క్రితమే అమెరికాలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాజాగా రమేష్ తల్లిదండ్రుల కోరిక మేరకు మసిరెడ్డి తాండాకు తిరిగి వచ్చారు.
సొంత గ్రామానికి చేరుకున్న రమేష్ వారి తల్లిదండ్రుల కోరిక మేరకు వారి సంప్రదాయ పద్ధతులలో ప్రేమికుల దినోత్సవం రోజున వీరిద్దరికీ తిరిగి వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. వీరి వివాహానికి బంధువులతోపాటు ప్రజా ప్రతి నాయకులు అయినటువంటి అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, సర్పంచి నానునాయక్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బీలునాయక్, ఉపసర్పంచి రవీందర్, వార్డు సభ్యులు హాజరై ఆశీర్వదించారు. ఈ విధంగా ప్రేమించుకున్న ఆ జంట ప్రేమికుల దినోత్సవం రోజున సాంప్రదాయ పద్ధతులలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ప్రేమికుల దినోత్సవం రోజు రెండు దేశాల ప్రేమికులు ఒకటి అయిన సంగతి తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.