ఈ కాయను చలికాలంలో తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Satvika
చలికాలం అంటే కొంచెం త్రిల్ ఫీల్ అవుతారు.. సమ్మర్ సీజన్ కన్నా వింటర్ సీజన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. చల్లని గాలికి , చలికి వెచ్చని సూర్యకిరణాలు తనువును తాకుతుంటే ప్రతి ఒక్కరూ ఏదో అనుభూతిని పొందుతారు. అయితే ఈ చలికాలంలో కూడా చాలా పండ్లు వస్తుంటాయి.. సీజన్ పండ్లను ఎక్కువ తింటారు.. అనారోగ్య రుగ్మతలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. ముఖ్యంగా జలుబు దగ్గు ఎక్కువగా వస్తాయి.. అయినా కూడా తిండి విషయంలోనూ  ఏ మాత్రం వెనక్కి తగ్గరు..



చలి కాలంలో జామ కాయలు లేదా జామ పండ్లను తినడం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జలుబుతో బాధపడేవారు జామ తినొద్దని చాలామంది చెబుతుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే.. జామ కాయలో జలుబును తగ్గించే లక్షణాలున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు ఒక పెద్దసైజు జామకాయను తీసుకుని.. అందులో గింజలు తీసేసి తినాలి. ఆ తర్వాత గ్లాసు నీళ్లు తాగితే ఔషదంలా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని , తగ్గును తగ్గిస్తుందట..



వీటివల్ల జలుబు కూడా పరార్ అవుతుందట..ఈ విషయం పై అనేక మంది పరిశోధనలు జరిపారు.. తాజాగా కొయంబతూర్‌లోని తమిళనాడు అగ్రీకల్చరల్ యూనివర్శిటీకి చెందిన బయోకెమిస్ట్రీ మాజీ ప్రొఫెసర్ దాయుమనావన్ బాలస్వామి జామ కాయల పై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-బి, ఫైబర్, విటమిన్-సి ఉంటాయి. ముఖ్యంగా తాజా జామ కాయల్లో ఆరెంజ్‌లో 6 రెట్లు ఎక్కువ విటమిన్-సి ఉంటుంది. అరటి పండ్లు తినడం కన్న  20 రేట్లు అధికంగా ఉంటుందని చలి కాలంలో జామను తినడం ఎంతో మంచిది. జామ లోని ఐరన్, విటమిన్-సి జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే అవకాశం ఉందని అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: