ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు కొనాల్సినవి ఇవే.?
సాధారణంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నేటి రోజుల్లో అంతగా శ్రద్ధ చూపడం లేదు. ఉరుకుల పరుగుల జీవితం జాబ్.. టెన్షన్స్ ఇలా రోజురోజుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు తప్ప ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఆలోచన చేయడం లేదు నేటి తరం మహిళలు . అయితే మామూలు సమయంలో ఎలా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. నేటి రోజుల్లో చాలామంది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ కూడా జాబ్ ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఆలోచనతో ఇలా జాబ్ చేయడం మంచిదే కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రమాదం తప్పదు. అయితే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు వదులుగా ఉండే బట్టలు వేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం బిగుతుగా ఉండే బట్టలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. గాలి బాగా ఆడేలా బట్టలు వదులు గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో రొమ్ముల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి బదులుగా బట్టలు వేసుకోవడం వల్ల ఊపిరి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. ఎక్కువగా కాటన్ బట్టలు కొనుక్కొని వేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ గ ఉన్న మహిళలు మోడ్రన్ గా కనిపించడానికి కొన్ని వస్త్రాలను మీ వార్ట్ రోబ్ లో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మెటర్నిటీ బ్రా, కాటన్ ప్యాంటీస్ ఉండేలా చూసుకోండి లెగ్గిన్స్ జీన్స్ నీ కొన్ని రోజుల వరకు మాత్రమే వాడేలా పరిమితం చేసుకోండి. మరీ ఇబ్బందిగా ఉంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చే స్ట్రెచబుల్ డ్రెస్సులను కొనుక్కుని ఉపయోగించవచ్చు. చాలా మంది మహిళలు హిల్స్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అయితే గర్భిణిగా ఉన్న సమయంలో హిల్స్ జోలికి అస్సలు పోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పాదరక్షలు ప్లాట్ గా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో మేకప్ జోలికి కూడా వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో నాచురల్ గా ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత అంత అందం పెరుగుతుంది అని చెబుతున్నారు. మరి కొన్ని జాగ్రత్తలు వైద్యులను సంప్రదించి గర్భిణీలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.