కంటి నిండా నిద్ర రావాలంటే.. ఈ పని చేయండి..!

నిద్ర.. పైసా ఖర్చు లేకుండా ప్రకృతి మనిషికి ఇచ్చే ఆనందం ఇది. నిద్ర విలువ నిద్రపోయే వారికంటే.. నిద్రపట్టనివారికి బాగా తెలుస్తుంది. సరిగ్గా నిద్రపోక పోతే వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మానసిక ప్రశాంతత కరవవుతుంది. ఏ పనిపైనా ఏకాగ్రత కలగదు.

కొందరికి రాత్రి సమయాల్లో ఎంతకూ నిద్ర రాదు.. నిద్రలేమితో బాధపడుతుంటారు. సాధారణంగా రాత్రి సమయంలో ఎక్కవగా తినకూడదు. అలాగని పొట్ట ఖాళీగా పెట్టుకుంటే.. ఆకలితో నిద్ర సరిగ్గా రాదు. అందువల్ల కడుపు ఖాలీగా ఉంచకుండా హెల్తీ స్నాక్స్ తినడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.



రాత్రి సమయంలో పిస్తా పప్పు తినడం ద్వారా ఆకలిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఇవి కాసిని తినగానే శక్తి లభించి ఆకలి తగ్గిస్తాయి. అందుకే చక్కగా నిద్రపడుతుంది. వీటిలో కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కవగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.

 అరటి పండ్లు కూడా రాత్రి సమయంలో బాగా ఉపయోగపడతాయి. బనానా షేక్‌ చేసుకోవచ్చు. అరటి పండ్లను చిన్న ముక్కలుగా కోసుకుని కూడా తినొచ్చు. ఇవి కూడా శరీరానికి బలాన్ని ఇవ్వడమేగాక నిద్ర పట్టేలా చేస్తాయి. ఇలా తేలిగ్గా జీర్ణమయ్యే బలవర్థకమైన చిరుతిళ్లు తినడం ద్వారా నిద్రను ఆహ్వానించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: