మండే వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి మనం ఎక్కువగా మంచి నీటిని తీసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడటం సర్వ సాధారణం. ఈమండే వేసవిలో మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ను అరికట్టవచ్చని వైద్యులు చెపుతూ ఉన్నా ఇటీవల లేటెస్ట్ అధ్యయనాల ప్రకారం ఎక్కువగా నీటిని తాగేవారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురు కావడం ఖాయం అని అంటున్నారు.
ఎక్కువగా మంచి నీరు త్రాగేవారికి శరీరంలో నీరు నిలిచిపోవడం అధికమవడం వల్ల రక్తంలో ప్రమాదకరంగా సోడియం స్థాయిలు పడిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అంతేకాదు కొంతమంది అనుకోకుండా మెదడు వాపుకు గురి కావచ్చు అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్త పరుస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని వాటర్ ఇంటాక్సికేషన్ అని అంటారు. మన శారీరంలో తగినంత సోడియాన్ని భర్తీ చేయకుండా నీటిని ఎక్కువగా తాగడం వలన వాటర్ ఇంటాక్సికేషన్ సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది. సాధారణంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు. అయెతే కొంత మంది తమకు తెలియకుండానే ఎక్కువ మంచినీరు తీసుకుంటున్నారు.
ఇలా అవసారినికి మించి ఎక్కువ మంచినీరు తీసుకోవడం ఒకరకమైన మానసిక రుగ్మత అనే ప్రచారం కూడ ఉంది. ఎక్కువ మంచి నీరు తాగడం వలన గ్యాస్ట్రోయేంట్రయిటిస్ మరియు కిడ్నీస్ పనితీరు దెబ్బతినే ఆస్కారం ఉంది అని కూడ కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. దీనికితోడు ఎక్కువగా మంచి నీరు త్రాగే వారిలో శ్వాసలో ఇబ్బందులతో పాటు వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయని మరికొన్ని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.
అతిగా నీటిని తీసుకోవడం వలన కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా పడటమే కాకుండా కిడ్నీలు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అని మరికొందరు వైద్యులు చెపుతున్నారు. అదే విధంగా ఎక్కువగా నీళ్లను తీసుకోవడం వలన శరీరంలోని బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుందని దీనివలన గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది అని కూడ మరికొందరి వైద్యుల వాదన. అయితే ఒక వ్యక్తి యొక్క జెండర్, వయసు, ఆరోగ్య స్థితితో పాటు అతడి జీవన శైలిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎవరు ఎంత మంచినీరు తాగోలో వైద్యులు నిర్ణయిస్తారు కాబ్బట్టి ఇలాంటి విషయాలలో అప్పుడప్పుడు అయినా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని కూడ లేటెస్ట్ అద్యయనాలు తెలియ చేస్తున్నాయి..