ఈ పదార్థాలను పెరుగుతో కలిపి తింటున్నారా..?

Divya
మన హిందూ సంప్రదాయం వంటలలో పెరుగు తప్పనిసరి.భోజనం లో ఎన్ని పదార్థాలు తిన్నా,చివరికి పెరుగన్నంతో ముగించడం మన పెద్దల నుంచి వచ్చిన అలవాటు అని చెప్పొచ్చు.పెరుగు తినడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడమే కాక,మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కళంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం,మెగ్నీషియం,విటమిన్లు అధికంగా లభిస్తాయి.ఇటువంటి పెరుగును కొన్ని రకాల ఆహారాలతో కలిపి తినడంతో,మన శరీరానికి హానికారకంగా మార్చుకుంటూ ఉన్నాము.దానిని విషంగా మన చేతుల నుంచి మనమే చేసుకుంటూ ఉన్నాము. ఎటువంటి ఆహారాలతో పెరుగు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మాంసము..
చాలామంది చికెన్,మటన్,చేపలను పెరుగుతో కలిపి వండుతూ ఉంటారు.అలా వండిన ఆహారాలను మనం తీసుకోవడం వల్ల,మన ఆరోగ్యం దెబ్బతింటుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.దీనికి కారణం పెరుగు తొందరగా జీర్ణమవుతుంది కానీ మాంసంలో ఉన్న ప్రోటీన్స్ తొందరగా జీర్ణం కాక,అజీర్తి,మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను కలగచేస్తాయి.
మామిడిపండు..
చాలామంది వేసవి సీజన్ లో వచ్చే మామిడిపండ్లతో, పెరుగును కలుపుకొని తింటూ ఉంటారు.దీనివల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.సాధారణంగా మామిడిపండుకు వేడి చేసే గుణం ఉంటుంది.అందువలన పెరుగు,మామిడిపండు కాంబినేషన్ అస్సలు మంచిది కాదు.
కాఫీ,టీ..
కొంతమంది పెరుగుతో భోజనం చేసిన తర్వాత కూడా వెంటనే కాఫీలు టీలు తాగుతూ ఉంటారు.అలా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయక అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 డ్రై ఫ్రూట్స్..
కొంతమంది ప్రసాదాలను దద్దోజనం చేయడానికి డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు.డ్రై ఫ్రూట్స్ తిన్న వెంటనే పెరుగుని అసలు తినకూడదు.దీనికి కారణం డ్రైఫ్రూట్స్ లో అధిక ప్రోటీన్స్ ఉండడమే.అలా తినడం వల్ల మన ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది.
మినప్పప్పు..
కొన్ని ప్రదేశాలలో పెరుగు వడలు చాలా ఫేమస్.కానీ మినప్పప్పుతో పెరుగును అస్సలు తినకూడదు అని ఆహార నిపుణులు హెచ్చరిస్తూన్నారు.దీనివల్ల ఆజీర్తి,గ్యాస్,మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: