కొవ్వు గడ్డలని ఈజీగా నివారించే మార్గం?

Purushottham Vinay
మన శరీరం పై వుండే కొవ్వు గడ్డలను ఎడిమా అని  అంటారు. సాధారణంగా ఈ కొవ్వు గడ్డలు ఎలాంటి నొప్పిని కలిగించవు. ఇంకా అలాగే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు.అయితే కొన్ని సార్లు మాత్రం ఇవి నరాలపై ఏర్పడుతూ ఉంటాయి. ఇక అలాంటి సమయంలో కొద్దిగా నొప్పి కలుగుతుంది. అయితే కొవ్వు గడ్డల వల్ల ఎలాంటి నష్టం లేనప్పటికి ఇవి కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలుగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా మంది కూడా శస్త్ర చికిత్స ఒక్కటే ఈ గడ్డలను ముందుగానే నివారించడానికి మార్గమని భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే ఆయుర్వేద చిట్కాను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం పచ్చి పసుపును, నాలుగు లవంగాల పొడిని ఇంకా ఒక టీ స్పూన్ ఆవ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు వాపును తగ్గించి గడ్డలు కరిగేలా చేయడంలో బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే లవంగాల్లో యూజినాల్ అనేది ఉంటుంది.


ఇది ఒక సహజమైన మత్తు మందులా పని చేస్తుంది. ఇంకా నొప్పిని తగ్గించడంలో ఇది చక్కగా పని చేస్తుంది. ఇంకా అలాగే నరాల నొప్పులను తగ్గించడంలో ఆవనూనె కూడా చక్కగా పని చేస్తుంది. ఎందుకంటే ఈ ఆవ నూనె వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ వేడి వల్ల గడ్డలు ఈజీగా కరిగిపోతాయి. ఈ పదార్థాలతో టిప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  పచ్చి పసుపు లేదా ఆర్గానిక్ పసుపును మీరు ఉపయోగించాలి.ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పసుపును తీసుకోని ఆ తరువాత ఇందులో లవంగాల పొడిని వేసి కలపాలి. ఆ తరువాత ఆవ నూనె వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని గడ్డలపైరాసి వస్త్రంతో కట్టు కట్టాలి. దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా గడ్డలు తగ్గే దాకా ఈ టిప్ ని పాటించాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు గడ్డలు చాలా ఈజీగా కరిగిపోతాయి. ఈ టిప్ ని పాటించడం వల్ల ఎలాంటి హాని లేకుండా చాలా ఈజీగా కొవ్వు గడ్డలను నివారించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: