ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ ఇడ్లీ ఇవే?

Purushottham Vinay
మనం అల్పాహారంగా తీసుకునే ఆరోగ్యకరమైన పదార్థాల్లో ఖచ్చితంగా ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలను చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటారు.అయితే ఈ ఇడ్లీలను మనం మరింత రుచిగా ఇంకా అలాగే ఆరోగ్యానికి చాలా మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు.ఓట్స్ ఇంకా వెజిటేబుల్స్ వేసి చేసే ఈ ఇడ్లీలు కూడా చాలా రుచిగా అలాగే మెత్తగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలను మనం ఇన్ స్టాంట్ గా కేవలం ఒక అరగంటలోనే తయారు చేసుకోవచ్చు.బాగా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక ముందుగా కళాయిలో ఓట్స్ ను వేసి వాటిని దోరగా వేయించాలి.ఆ తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.ఆ తరువాత అదే కళాయిలో రవ్వ వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.ఇక ఇప్పుడు వేయించిన ఓట్స్ ను జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకున దీనిని కూడా గిన్నెలోనికి తీసుకోవాలి.


తరువాత ఇందులో నీళ్లు ఇంకా వంటసోడా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక పావు గంట పాటు రవ్వను నానబెట్టాలి. ఇప్పుడు వంటసోడా వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఆ ఇడ్లీని పిండిలా కలుపుకోవాలి.ఆ తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి.ఇక తరువాత ఇడ్లీ ప్లేట్ లలో పిండిని వేసుకుని కుక్కర్ లో ఉంచాలి. వీటిపై మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి ఇడ్లీలను బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆ తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉండే ఓట్స్ వెజిటెబుల్ ఇడ్లీలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. తరచూ చేసే ఇడ్లీలతో పాటు ఇలా వెజిటేబుల్ ఇడ్లీలను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: