నీళ్ళు తాగే పద్ధతులు ఏంటో తెలుసా..?

Divya
అవునండి నీళ్ళు తాగటానికి,భోజనం చేయడానికి కొన్ని పద్ధతులు అలాంటి పద్ధతులను ఆచరించడంతోనే మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అంది, మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది.ఆహార నియమాలు పాటించకపోతే రకరకాల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆహారం నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరి నీళ్ళు తాగే పద్ధతులు అంటే ఇప్పుడు తెలుసుకుందామా..
నీరు మన శరీరాన్ని డిహైడ్రెటెడ్ గా ఉంచడానికి,తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడానికి,మన శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.నీళ్ళు తీసుకోవడంతో ఆరోగ్యాన్నిస్తుంది కదా అని ఎక్కువ తాగటం,లేదా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తుందని తక్కువ తీసుకోవడం వంటివి అసలు మంచివి కావు.ఈ రెండు నియమాల వల్ల మన ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది.సగటు మనిషి సాధారణ రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తీసుకుంటే చాలనీ,ఆహార నిపుణులు చెబుతున్నారు.
మరియు కొంతమంది నిలబడి నీరు తాగుతూ ఉంటారు.అలా చేయడం వల్ల మనం తాగిన నీరు ఎలాంటి ఫిల్టరేషన్ లేకుండా పొట్టలోకి వెళ్తాయి. దానివల్ల నీటిలోని ఏమైనా మలినాలు ఉంటే, గాల్బ్లాడర్ లోకి వెళ్లి కిడ్నీలో రాళ్లు ఫామ్ అవడానికి దోహదపడతాయి.కావున నిలబడి నీరు తాగడం అస్సలు మంచిది కాదు.నీళ్ళు తాగేటప్పుడు కూర్చుని నెమ్మది నెమ్మదిగా తాగడం వల్ల,మంచి ఆరోగ్యం లభిస్తుంది.
పడుకునే ముందు చాలా మంది మీరు ఎక్కువగా తాగి పడుకుంటూవుంటారు.అలా చేయడం వల్ల,పొట్టలో మూత్రం ఏర్పడి,నిద్ర మధ్యలో లేవాల్సివస్తుంది.దీనితో నిద్రకు భంగం కలగడమే కాక,కిడ్నీ పనితీరుపై కూడా  ప్రభావం పడుతుంది.
నీళ్లు తాగడం చాలా అవసరం కదా అని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోనేట్రిమియా అనే వ్యాధి వస్తుంది. దీనితో కణాల్లో వాపు,వాంతులు,వికారానికి వంటి సమస్యలు కలుగుతాయి.
మన శరీరంలో నీరు సరిపోయిందని తెలుసుకోవడానికి,
మన మూత్రం ఒక కొలమానమని చెప్పవచ్చు.మూత్రం పసుపు పచ్చగా మారితే మన శరీరానికి తగినంత నీరు అందనట్టు.ఒకవేళ మూత్రం తెల్లగా ఉంటే,మన శరీరానికి కావలసిన నీరు అందినట్టు.కావున ఈ కొలమానం ప్రకారం నీటిని తగిన మోతాదులో తీసుకొని, ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడం మన బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: