అలసటని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా నీరసం, బలహీనత, అలసట వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.అలాగే నిద్రలేమి, ఐరన్ లోపించడం, ఒత్తిడి ఇంకా డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుందనే చెప్పవచ్చు.చాలా మంది కూడా అసలు వీటికి కారణాలు తెలియక ఎంతగానో సతమతమైపోతూ ఉంటారు. ఇలా నీరసం, బలహీనత బారిన పడడానికి ప్రధాన కారణం ఫోలేట్ లోపమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోలేట్ నే విటమిన్ బి9 అని కూడా అంటారు. ఇది శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ఫోలేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంకా అలాగే శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ అనేది సక్రమంగా సరఫరా అవ్వదు.అందువల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి కావల్సినంత శక్తి లభించదు. ఇంకా అదే విధంగా కార్బోహైడ్రేట్స్ ను విచ్ఛినం చేసి శక్తిని ఉత్పత్తి చేయడంలో ఫోలేట్ సహాయపడుతుంది.


 శరీరంలో ఫోలేట్ లోపించడం వల్ల తల తిరిగినట్టుగా ఉండడం, నీరసం ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల రావడం, చర్మం పాలిపోయినట్టుగా ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించాలంటే మనం ఎక్కువగా ఫోలేట్ ఉన్న ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ప్రతిరోజూ 400 మైక్రో గ్రాముల ఫోలేట్ ను తీసుకోవాలని అదే గర్భిణీ స్త్రీలైతే 600 నుండి 800 మైక్రో గ్రాముల ఫోలేట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫోలేట్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఈ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు.ఇక ఆకు పచ్చ కూరగాయల్లో, నిమ్మజాతికి చెందిన పండ్లల్లో, బీన్స్, అవకాడో, పాలకూర, ఆస్పరాగస్, బ్రస్సెల్స్ మొలకలు, అలసందలు, ఆవాలు ఇంకా లివర్ వంటి వాటిలో కూడా ఫోలేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఫోలేట్ అనేది లభిస్తుంది. నీరసం, బలహీనత ఇంకా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: