మొలలు, మలబద్ధకం తగ్గే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా మొలల సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల కలిగే బాధ అసలు అంతా ఇంతా కాదు. మలవిసర్జన సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.ఇంకా అలాగే మొలల వెంట రక్తం కూడా కారుతుంది.ఇంకా ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే.జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం ఇంకా కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం అలాగే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య ఈజీగా తలెత్తుతుంది. మొలల సమస్యతో బాధపడే వారిలో చాలా మంది మలబద్దకం సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీరిలో మలవిసర్జన అనేది సాఫీగా సాగదు.దీంతో మొలల సమస్య చాలా తీవ్రమవుతుంది.అయితే ఒక సింపుల్ హోమ్ టిప్ ని ఉపయోగించి మనం చాలా సులభంగా మొలల సమస్య నుండి బయటపడవచ్చు.ఈ టిప్ మొలలను తగ్గించి జీర్ణక్రియను సాఫీగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇక మొలలను తగ్గించే ఈ హోమ్ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం నిమ్మకాయను, పసుపును ఇంకా జీలకర్ర పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. మొలల సమస్యతో బాధపడే వారు నిమ్మకాయను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రస్ ప్రేగుల్లో ఉండే మలాన్ని మెత్తగా చేసి మలద్వారం వద్ద తలెత్తే సమస్యలన్నింటిని తొలగించడంలో బాగా సహాయపడుతుంది.అలాగే నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల మలవిసర్జన సమయంలో నొప్పి లేకుండా ఉంటుంది.


ఇంకా అలాగే ఆర్గానిక్ పసుపును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అలాగే మొలలను తగ్గించడంలో పసుపు అద్భుతంగా పని చేస్తుంది. పసుపును వాడడం వల్ల మొలల వల్ల కలిగే నొప్పి, వాపు నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా అలాగే జీలకర్ర పొడిని ఉపయోగించడం వల్ల కూడా మొలల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ముందుగా ఒక టీ స్పూన్ జీలకర్రను కళాయిలో వేసి వేయించి దానిని పొడిగా చేసుకోవాలి. జీలకర్రను వాడడం వల్ల జీర్ణ సమస్యలు ఈజీగా తగ్గుతాయి. దీనిని వాడడం వల్ల అజీర్తి, మొలలు ఇంకా బంక విరోచనాలు వంటి చాలా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య ఈజీగా దూరమవుతుంది. ఈ పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా మొలల సమస్య నుండి బయటపడవచ్చు. ఇందుకోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి.ఆ తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల చాలా ఈజీగా మొలల సమస్య నుండి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: